హైదరాబాద్

చిరుజల్లుకే చిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: పేరుకే గ్రేటర్..చిరుజల్లులు కురిసినా ప్రజలకు బడా బాధలు తప్పటం లేదు. కొద్దిరోజులుగా నగరంలో తరుచూ ఆకాశం మేఘావృతమవుతున్నా, వర్షాలు కురవటం లేదు. కానీ గురువారం ఉదయం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం కావటం, మళ్లీ క్షణాల్లోనే ఎండ రావటం, చిరుజల్లులు కురవటం వంటి విచిత్ర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కానీ సాయంత్రం అయిదు గంటల వరకు నగరంలోని సికిందరాబాద్, ట్యాంక్‌బండ్, ఉప్పల్, అమీర్‌పేట, బేగంపేట, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులతో మొదలై ఓ మోస్తారు వర్షం కురిసింది. సరిగ్గా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం కురవటంతో ఇబ్బందులు తప్పలేదు. చిన్నపాటి వర్షానికే సచివాలయం, మాసాబ్‌ట్యాంక్, రాణిగంజ్, పంజాగుట్ట, అసెంబ్లీ ముందున్న జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ మొరాయించటంతో వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులకు ఇక్కట్లు తప్పలేవు. ఇక శివార్లలోని ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడా, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో కాసేపువర్షం దంచికొట్టింది. ఆఫీసు వేళల్లో వరుసగా చిరుజల్లులు కురవటంతో నిత్యం రద్ధీగా ఉండే పలు కూడళ్లు, జంక్షన్లలో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. ఇక మెట్రోరైలు పనులు చురుకుగా జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు వర్ణణాతీతం. చిరుజల్లులతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా నీరు నిలవటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేవు. దీంతో పాటు నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలతో కిటకిటలాడే లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ద్వారకాహోటల్ చౌరస్తాలో వర్షం కురిసినపుడు ట్రాఫిక్ నియంత్రణ గందరగోళంగా తయారైంది. ఓ మోస్తారుగా వర్షం పడిన ఉప్పల్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి, ట్రాఫిక్ జాం అయినా ఎక్కడా కూడా జిహెచ్‌ఎంసి అధికారులు సహాయక చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. వర్షాకాలం రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండేలా అత్యవసర బృందాలను అందుబాటులో ఉంచామని అధికారులు గొప్పగా ప్రకటనలు చేస్తున్నా, కనీసం మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సైతం రోడ్లపై నిలిచిన నీటిని సకాలంలో తోడేయకపోవటంతో వాహనదారులకు ఇబ్బందుల రెట్టింపయ్యాయి.