హైదరాబాద్

భోలక్‌పూర్ పరిశ్రమల తరలింపునకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: నగరం నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన భోలక్‌పూర్‌లోని 107 తోళ్ల పరిశ్రమలను తరరించే దిశగా వివిధ ప్రభుత్వ శాఖలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే జిహెచ్‌ఎంసి కమిషనర్ డా. జనార్దన్ రెడ్డి శుక్రవారం ఈ పరిశ్రమలను సందర్శించారు. ఇక్కడి తోళ్ల పరిశ్రమల్లో తోళ్లను శుద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యంతో కూడిన వ్యర్థాలు నాలాల్లో వదలడం వంటివి జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిశ్రమల్లో నుంచి వెలువడిన వ్యర్థాల కారణంగానే గతంలో భోలక్‌పూర్‌లో తాగునీరు కలుషితమై 14 మంది మృత్యువు బారిన పడిన నాటి నుంచి ఇక్కడి పరిశ్రమలను తొలగించాలన్న ప్రతిపాదన ఉన్నా, నేటికీ కొలిక్కిరావటం లేదు. ఈ క్రమంలో లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా ఈ పరిశ్రమలను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాయి. వీటిని తొలగించి భవనగిరి సమీపంలోని కూనూర్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లెదర్‌పార్కును పదేళ్ల క్రితమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా, ఇక్కడి నుంచి కేవలం మూడు ఎముకలను శుద్ది చేసే పరిశ్రమలు మాత్రమే తరలివెళ్లాయి. అయితే మిగిలిన తోళ్ల, ప్లాస్టిక్ పరిశ్రమ యూనిట్లను చెంగిచెర్లకు తరలించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ నగరానికి దూరంగా ఉన్న కొత్లాపూర్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ సంఘం నిరాకరించింది. ఈ శాన్ని దృష్టిలో పెట్టుకుని జిహెచ్‌ఎంసి సైతం యూనిట్లను తరలించేందుకు నగరానికి కాస్త దగ్గర్లోని కీసర మండలలోని రాంపల్లి గ్రామంలో 44 ఎకరాల స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ స్థలంలో ఎల్‌పిజి పైప్‌లైన్ ఉన్నందున, వాటి భద్రత ఆందోళనకరంగా మారే అవకాశముండటంతో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ సర్కారుకు లేఖ రాసింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఈ యూనిట్ల కోసం ఘట్‌కేసర్ మండలంలోని ఎదులాబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని జిహెచ్‌ఎంసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం తెలంగాణ భూ నిర్వాహణ అథారిటీ పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ ఆధీనంలో ఉన్న 15 స్థలాలను కూడా పరిశీలించి అనువైన స్థలాన్ని ఈ తోళ్ల పరిశ్రమలకు ప్రతిపాదించాలని జిహెచ్‌ఎంసి తెలంగాణ భూ నిర్వాహణ అథారిటీ సూచించినట్లు అధికారులు వెల్లడించారు.
తరలింపునకు ప్రత్యేక కమిటీ నియామకం
భోలక్‌పూర్ తోళ్ల పరిశ్రమల తరలింపునకు సంబంధించి కొద్దిరోజుల క్రితం మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలోనే శుక్రవారం తాను ఈ పరిశ్రమలను సందర్శించినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించి ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని కూడా నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటిని యుద్దప్రాతిపదికన తరలించాలని మంత్రి కెటిఆర్ సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. కానీ ఇక్కడి యూనిట్లు, అందులో చేస్తున్న పనులను చూసి కమిషనర్ నిర్ఘాంతపోయారు. తోళ్లను శుద్ధి చేయటంతో వెలువడుతున్న కాలుష్యంతో కూడిన వ్యర్థ జలాలు, సరైన జాగ్రత్తలు లేకుండా కార్మికులు చేస్తున్న పనులు, దుర్గంధ వాతావరణం, ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్లను అనుసరించని కనీస ప్రమాణాలు వంటి విషయాన్ని గమనించి కమిషనర్ ఒకింత ఆశ్చరాన్ని వ్యక్తం చేశారు. టిఎస్‌ఐఐసి ఆధీనంలో ఉన్న 15 స్థలాలను వెంటనే పరిశీలించి అనువైన స్థలాన్ని సూచించి, వెంటనే పరిశ్రమలను తరలించనున్నట్లు తెలిపారు. తరలింపునకు సంబంధించి నియమించిన కమిటీలో టిఎస్‌ఐఐసి, కాలుష్య నియంత్రణ మండలి, జలమండలి, రెవెన్యూ, జిహెచ్‌ఎంసి, ఇంజనీరింగ్, హౌజింగ్, వెటర్నరీ విభాగాలకు చెందిన అధికారులను సభ్యులుగా నియమిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆయన ఆదేశాలు వెంటనే ఆమల్లోకి రావటంతో శుక్రవారం రోజునే కమిటీ పలు ప్రాంతాలను సందర్శించటం విశేషం.