హైదరాబాద్

మహిళా కండక్టర్లకు కరాటేలో శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ఆర్టీసిలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. శనివారం హకీంపేటలోని జోనల్ స్ట్ఫా ట్రైనింగ్ సెంటర్‌లో ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు సూచనల మేరకు ప్రిన్సిపాల్ జిఆర్ కిరణ్ మహిళ కండక్టర్లకు కరాటేలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మహిళా కండక్టర్లలో మనోధైర్యం, మనోవికాసం, విధినిర్వహణలో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ఒక నెలలో రెండుసార్లు శిక్షణ ఇస్తున్నట్టు ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జిఆర్ కిరణ్ పేర్కొన్నారు. ప్రధానంగా హైదరాబాద్ జోన్‌లో పనిచేస్తున్న మహిళ కండక్టర్లకు శిక్షణ ఇవ్వడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారన్నారు.