హైదరాబాద్

ఎర్రకుంట చెరువును పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు నడుం బిగించి మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఎన్నో చెరువులకు కొత్తగా జీవం పోస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో ఫలితాలు అప్పుడే కనిపిస్తున్నాయి. అయితే రాజధాని నగరంలో సమైక్య రాష్ట్రంలో ఉనికిని కోల్పోయి కబ్జాకోరల్లో చిక్కుకుపోయిన చెరువులకు మోక్షం కల్పించడానికి మాత్రం ప్రభుత్వం నడుం బిగించలేకపోయింది. ఎన్నోవందల సంవత్సరాల చరిత్ర కలిగిన చెరువులను సైతం భూబకాసురులు లొసుగులను ఉపయోగించుకుని చెరువులను పూడ్చివేసి కనీసం స్వరూపాలు లేకుండా చేసి యధేచ్ఛగా కబ్జాలు చేసి బడా నిర్మాణాలు చేపట్టారు. ఇందుకు సమాజంలో పేరుమోసిన పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న ఎందరో మహానుభావులు కూడా ఉన్నారు. పైకి నీతి వాక్యాలు వల్లిస్తూనే లోపల అప్పనంగా ప్రభుత్వ స్థలాలను, ప్రజలకు చెందాల్సిన ఆస్తులను కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్న వారిని ఈ ప్రభుత్వాలు ఎంతమాత్రం ఇబ్బందులు కలిగించవు. ఇలా నగరంలో కనిపించకుండా పోయి కనుమరుగైన చెరువులు ఎన్నోఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా అలాంటి వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకుని జీవం పోస్తుందని అంతాఅనుకున్నారు. కాని నగరంలో మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారో నగర ప్రజలకు తెలియడం లేదు. తార్నాకలో ఎర్రకుంట చెరువును బడా వ్యాపారులు, రాజకీయనాయకులు ఎవరికి వారు రక్షిస్తున్నామంటూనే ఎవరికి తోచినంత వారు బినామీలతో కబ్జాచేశారన్నది జగమెరిగిన సత్యం. చెరువు ప్రాంతంలో అపార్టుమెంట్‌లో, ఖరీదైన నిర్మాణాలు వెలుస్తున్నా రెవెన్యూ అధికారులకు, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలకు జిహెచ్‌ఎంసి అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా వాటిని ఆపడంలో మాత్రం ముందుకు రారు సరికదా కనీసం అటువైపు కనె్నత్తయినా చూడరు. అదే ఎవరైనా సామాన్యులు చిన్నగదిని నిర్మించుకుంటే మాత్రం ఆగమేఘాల మీద వాలిపోయి వారిని సవాలక్ష రూల్స్‌తో ముప్పుతిప్పలు పెట్టడంలో మాత్రం వీరిది అందెవేసిన చేయి. ఎర్రకుంట చెరువు కబ్జాకోరల్లో పోయింది పోగా మిగిలిన కొద్దిపాటి ప్రాంతాన్ని ఎఫ్‌టిఎల్ ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులు గ్రేటర్ మేయర్ కార్తీకరెడ్డి హయాంలో చెరువుతోపాటు ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టాలని సంకల్పించారు. కాని శాఖల మధ్య సమన్వయలోపంతో ఇప్పటికీ ఆ పనులు ఎంతమాత్రం ముందుకు సాగలేదు. కనీసం మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగానైనా అభివృద్ధి జరుగుతుందని ఎదురుచూసిన ఈప్రాంత వాసులకు నిరాశే ఎదురైంది.
ఇప్పటికైనా ప్రభుత్వం నగరంలో కబ్జాకోరల్లోకి వెళుతున్న చెరువులను గుర్తించి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది. నగరంలో చిన్నపాటి వర్షానికి రోడ్లు చెరువులను తలపించడం, బస్తీలను ముంచెత్తడానికి కారణంగా చెరువులను మింగేయడమేనన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది.