హైదరాబాద్

పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: కేంద్ర ప్రభుత్వం రూపొందించన శ్యాంప్రసాద్ ముఖర్జి రూర్‌బన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాలల్లో ఆర్థిక, సామాజిక, వౌలిక సదుపాయాల కల్పనతో పట్టణ ప్రాంతాలకు దీటుగా అభివృద్ధి చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో రూర్‌బన్ మిషన్‌కు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. స్థానిక ఆర్ధిక అభివృద్ధి, వౌలిక వసతులతో రూర్‌బస్ క్లస్టర్ ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం, పేదరికం తగ్గించేందుకు స్థానికంగా ఆర్ధిక పరిపుష్టి కల్పించేందుకు అస్కారం ఉంటుందని చెప్పారు. రూర్‌బస్ మిషన్ కింద రంగారెడ్డిజిల్లాలోని తాండూరు మండలం అల్లాపూర్ గ్రామం ఎన్నికైందని తెలుపుతూ ఈ క్లస్టర్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు వివిధ శాఖల అధికారులు ప్రతిపాదనలు రూపొందించి వివరాలను పొందుపరిచి డ్వామా పిడికి వచ్చే శనివారంలోపు అందచేయాలని కోరారు. విద్య, డిజిటల్ లిటరసి, వృత్తి నైపుణ్య కార్యక్రమాలు, రోడ్లు, వీధి దీపాలు తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ రఘునందన్ రావు సమీక్షించారు. సమావేశంలో వికారాబాద్ సబ్‌కలెక్టర్ శృతి ఓజా, డ్వామా పిడి హరిత, సిపిఓ శర్మ, డిఆర్‌డిఎ పిడి సర్వేశ్వర్‌రెడ్డి, సర్వశిక్ష అభియాన్ పిఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి చంద్రారెడ్డి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ భానుప్రకాష్, ఐసిడిఎస్ పిడి నూర్జహాన్, హౌసింగ్ పిడి బల్‌రామ్, వ్యవసాయ శాఖ జెడి జగదీశ్ పాల్గొన్నారు.
హరితహారం మొక్కల సంరక్షణకు సూక్ష్మ ప్రణాళికలు
రంగారెడ్డి జిల్లాలో హరిత హారం కార్యక్రమం కింద నాటిన మొక్కల సంరక్షణకు గాను సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ప్రత్యేకాధికారులను ఆదేశించారు. ప్రతి మంగళవారం నిర్వహించే మండల సమావేశాలకు సంబంధించి సోమవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నాటిన మొక్కల సంరక్షణ ముఖ్యమని ప్రతి ప్రత్యేకాధికారి మండల కేంద్రంలోని రెండు, మూడు ప్రాంతాలను సందర్శించి మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను గమనించాలని అన్నారు. ప్రతి సెక్టోరల్ అధికారి ప్రతి వారం ఆయా గ్రామాల్లో పర్యటించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు. మొక్కల సంరక్షణకు గాను నిధుల కొరత లేదని, మొక్కలు బతకడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశాల్లో చర్చించాలని అన్నారు. ఇప్పటికే ఎక్కడైనా మొక్కలు నాటేందుకు అవకాశం ఉంటే మొక్కలు నాటడం పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి మండలంలో 5 గ్రామాలను మొక్కల ప్రదర్శన ప్రాంతాలుగా గుర్తించడం జరిగిందని, ఆయా ప్రాంతాల్లో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సహాయం అందించేందుకు అర్హులైన లబ్ధిదారుల పూర్తి వివరాలను వచ్చే మంగళవారం నాటికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతా నెంబరు సరిగా ఉండేలా చూసుకోవాలని, విఆర్‌ఓలు ఆయా గ్రామాలకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించేలా చూడాలని అన్నారు. సంబంధిత తహశీల్దార్‌లతో ఈ వారం రోజుల్లో సమన్వయం చేసుకుని వివరాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారులకు సూచించారు. సమావేశంలో వికారాబాద్ సబ్‌కలెక్టర్ శృతి ఓజా, సిపిఓ శర్మ, డిఆర్‌డిఎ, డ్వామా పిడిలి సర్వేశ్వర్‌రెడ్డి, హరిత పాల్గొన్నారు.