హైదరాబాద్

మరింత సమర్ధవంతంగా ఐటి వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: ఆధునిక సాంకేతిక రంగంలో ఎప్పటికపుడు వస్తున్న మార్పులను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా కృషి చేస్తున్న నగర పాలక సంస్థల్లో జిహెచ్‌ఎంసి మొట్టమొదటి స్థానంలో ఉందని, మున్ముందు ఐటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. మంగళవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఐటి విభాగం అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు, జిహెచ్‌ఎంసి అదికారులతో మేయర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫైళ్ల నిర్వాహణను మరింత మెరుగ్గా చేపట్టేందుకు ఈ ఆఫీసును ప్రవేశపెట్టడం ద్వారా బల్దియాలో పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. జిహెచ్‌ఎంసి ఆర్థిక కార్యకలాపాల నిర్వాహణలో మరింత సమర్థవంతంగా ఐటిని వినియోగించుకుని, ఎప్పటికపుడు ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అకౌంట్స్ విభాగంలోని ఈఆర్‌పి(ఎంటర్‌ప్రైజెస్ రెజ్యుమ్ అండ్ ప్లానింగ్)లో మెరుగైన ఐటి ప్యాకేజీని ఉపయోగించుకోవాలని సూచించారు. దేశంలోని ఇతర కార్పొరేషన్లలో ఐటి సేవల వినియోగంపై అధ్యయనం చేసేందుకు అవసరమైతే జిహెచ్‌ఎంసి సీనియర్ అధికారులను అక్కడకు పంపాలని సూచించారు. కేంద్ర కార్యాలయంలోని ఐటి విభాగానికి అవసరమైన సిబ్బంది, ఐటి నిపుణులను కేటాయించడం ద్వారా సేవలు మరింత మెరుగుపడటంతో పాటు పరిపాలనపరంగా కార్పొరేషన్ పటిష్టపరిచేందుకు దోహదపడుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సురేంద్రమోహన్ పాల్గొన్నారు.