హైదరాబాద్

మెట్రో పిల్లర్లను దృష్టిలో పెట్టుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: నగరంలోని గణేశ మండపాల నిర్వాహకులు మెట్రోపిల్లర్లను దృష్టిలో పెట్టుకొని మండపాల ఏర్పాటు, నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం సాలార్‌జంగ్ మ్యూజియం సమావేశ మందిరంలో గణేశ మండపాల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ కార్యమ్రంలో నగర కమిషనర్‌తోపాటు దక్షిణ మండల డిసిపి సత్యనారాయణ, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రోత్సవాలను మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని సూచించారు. వినాయక చవితి, బక్రీద్ పండుగలు ఒకేసారి వస్తున్నందున అన్ని వర్గాల ప్రజలు కలసికట్టుగా ఘనంగా నిర్వహించుకోవాలని కమిషనర్ సూచించారు. పాతబస్తీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, గణేశ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని, విగ్రహాలు సకాలంలో నిమజ్జనం చేసి సహకరించాలని ఆయన చెప్పారు. గణేశ విగ్రహాల ఎత్తు విషయంలో పోలీస్ ఆంక్షలేమి లేవు..కానీ మెట్రో పిల్లర్లను ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకోవాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి కోరారు.