హైదరాబాద్

మహిళాలోకానికి రాణి రుద్రమదేవి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తార్నాక, నాచారం, ఆగస్టు 30: రాణి రుద్రమదేవి ధైర్యసాహసాలతో రాజ్యపాలన చేసి నారీలోకానికే ఆదర్శంగా నిలిచిందని ఎన్‌బిటి ఇండియా చైర్మెన్ బల్ధేవ్‌బాయ్ పేర్కొన్నారు. మంగళవారం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నేతృత్వంలో నేషనల్ బుక్ ట్రస్టు ఇండియా ప్రచురించిన రాణి రుద్రమదేవి పుస్తకావిష్కరణ సభ ఆంధ్రమహాసభ క్యాంపస్‌లో ఎన్‌బిటి పుస్తక వికాస కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బల్ధేవ్‌బాయ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్ర సంస్కృతి సాహిత్యాన్ని రానున్నతరాలకు అందించడానికి ఎన్‌బిటి ఎన్నో పుస్తకాలను ప్రచురించిందని తెలిపారు. రాణి రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది మహిళలు స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారని అన్నారు. వారి వీరగాథలతో కూడిన పుస్తకాలను ఎన్‌బిటి రూపొందిస్తుందని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల్లో విలువలను పెంపొందించడానికి, మన సంస్కృతి, సాహిత్య సంపదను తెలుసుకోవడాకి వీలుగా వారికి పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఎన్‌బిటి డైరక్టర్ రీటా చౌదరి మాట్లాడుతూ రాణి రుద్రమదేవి ఒకవైపు విజయవంతంగా అత్యంత ధైర్యసాహసాలతో రాజ్యపాలనతోపాటు అదే సమయంలో కుటుంబ బాధ్యతలను నిర్వహించారని తెలిపారు. కాకతీయ సామ్రాజ్యంలో రాజకీయ విలువలకు పెద్దపీట వేశారని రీటాచౌదరి పేర్కొన్నారు. డాక్టర్ ఆలేఖ్యపెంజాల రచించిన రాణి రుద్రమదేవి పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, త్రిపురనేని హనుమాన్‌చౌదరి, ఎన్‌బిటి సంపాదకులు డాక్టర్.పత్తిపాటి మోహన్, డాక్టర్, ఆలేఖ్యపుంజాల పాల్గొన్నారు.