హైదరాబాద్

ఖర్చు జాగ్రత్త! పరిమితి మించితే అనర్హత వేటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వివిధ పార్టీల నేతలు పరిమిత వ్యయంలో మాత్రమే ఖర్చు చేస్తూ, తమ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు తమకు సహకరించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి సూచించారు. అభ్యర్థులకు వ్యయ పరిమితి రూ. 5లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ణయించిందని, అంతకు మించి ఖర్చు చేసే అభ్యర్థులపై అనర్హత వేటు తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల వ్యయం, ప్రచార నిర్వహణ, ఓటింగ్ శాతం పెంపు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పరిమితి మించకుండా అభ్యర్థులు ఖర్చు చేయరాదని సూచించారు. విచ్చలవిడి ఎన్నికల వ్యయాన్ని అరికట్టడం, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయటానికి మొదటి సారిగా 28 సీనియర్ ఐఏఎస్ అధికారులను, మరో 24 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. అంతేగాక, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విచ్చలవిడి ఖర్చులు, డబ్బు, మద్యం పంపిణీ వంటి కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే ఫోన్లు 23261330, 23222018, 23221978లకు అందించవచ్చునని ఆయన తెలిపారు. వీటితో పాటు వీడియో సర్వేలెన్స్ బృందాలు, వీడియో వూయింగ్ టీం, అకౌంటింగ్ టీం, ఫ్లైయింగ్ స్క్వాడ్. మీడియా మానిటరింగ్ టీం తదితర బృందాలను ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉపయోగించే వివిధ రకాల వస్తువులకు అద్దె ధరలు నిర్థారించటం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల వ్యయం విషయంలో నిస్పక్షపాతంగా వ్యవహారించాలన్నారు. నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థుల తమ ఎన్నికల వ్యయానికి సంబందించి ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరిచి, సంబంధిత బ్యాంక్ ఖాతా నెంబర్‌ను నామినేషన్ పత్రంలో విధిగా సూచించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకూడదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో సెక్యూరిటీ పరంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడవచ్చునని దానికి ఇంధనం స్వయంగా వేయించుకోవల్సిందేనని ఆయన వివరించారు.
ప్రతిష్టను పెంపొందించండి
ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ స్థానిక సంస్థ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడం ద్వారా నగర ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని కమిషనర్ రాజకీయ ప్రతినిధులకు సూచించారు. ఓటింగ్ శాతాన్ని పెంచడంలో కృషి చేయాలని కోరారు. మొట్టమొదటి సారిగా పోలింగ్ ఆన్‌లైన్ ద్వారా పోలింగ్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటింగ్ శాతం పెంపొందించేందుకు తమకు సహకరించాలని కోరారు.