హైదరాబాద్

భారీ వర్షం.. అంతా అతలాకుతలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: మహానగరాన్ని భారీ వర్షం మరో సారి వణికించింది. గడిచిన నాలుగైదు రోజులుగా పగటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ఉక్కపోతకు గురైన నగరం బుధవారం కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం ఏడున్నర గంటల నుంచి గంటల తరబడి కురిసిన వర్షానికి నగరం మొత్తం అతలాకుతలమైంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో వర్షం కురవటంతో జనం ఇళ్ల నుంచి బయటకొచ్చేందుకు భయపడ్డారు. ఆఫీసు, స్కూల్, కాలేజీలకు వెళ్లే సమయంలో గంటల తరబడి ఎడతెరపి ఏకుండా వర్షం కురవటంతో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం ఉద్యోగులకు గంట సేపు మినహాయింపునివ్వగా, పలు ప్రైవేటు పాఠశాలలు సెలవును ప్రకటించాయి. కొన్ని ప్రాంతాల్లో పనె్నండు సెంటీమీటర్ల మేరకు వర్షం కురవటంతో డ్రైనేజీలు, నాలాలు, వరద నీటి కాలువలు పొంగి ప్రవహించాయి. రద్ధీగా ఉండే జంక్షన్లలో, రోడ్లపై మొకాలిలోతు వరకు వర్షపు నీరు నిల్వటంతో వాహనరాకపోకలు తీవ్రంగా స్తంభించాయి. అంబర్‌పేట, రామంతాపూర్,కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సికిందరాబాద్, బేగంపేట, ప్రేమ్‌నగర్, ముషీరాబాద్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, బోయిన్‌పల్లి, ఖైరతాబాద్, చింతల్‌బస్తీ, శివార్లలోని రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నిమ్స్ ఆసుపత్రి ముందు, లక్డీకాపూల్‌లో దాదాపు మూడు అడుగుల ఎత్తు వరకు వర్షపు నీరు నిలిచింది. ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆసుపత్రిలోకి నీరు రావటంతో రోగులు ఇబ్బందుల పాలయ్యారు. ట్యాంక్‌బండ్, సికిందరాబాద్ ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో జిహెచ్‌ఎంసి సిబ్బంది వాటిని తొలగించింది. గోల్నాక, నల్లకుంట, హిమాయత్‌నగర్, బర్కత్‌పురా, చిలకలగూడ, మారెడ్‌పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో సెల్లార్లు నీటి మునిగాయి. ఖైరతాబాద్, బేగంబజార్, చింతల్‌బస్తీ, ప్రేమ్‌నగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వర్షం కురుస్తున్నపుడే గాక, వర్షం ఆగిన తర్వాత పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ప్రకాశ్‌నగర్, అప్పర్‌ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్, కోఠి, ఆబిడ్స్, ఎం.జె.మార్కెట్, అఫ్జల్‌గంజ్, ప్రకాశ్‌నగర్, అమీర్‌పేట, బేగంపేట తదితర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. మాసాబ్‌ట్యాంక్, ఖైరతాబాద్, బేగంపేట, తెలుగుతల్లి ఫ్లై ఓవర్లపైనే గాక, కింద కూడా గంటల తరబడి ట్రాఫిక్ నిల్చిపోయింది.
ఎక్కడ ఎంత వర్షం
బుధవారం నగరాన్ని ఓ కుదుపు కుదిపిన భారీ వర్షం వివిధ రకరకాలుగా నమోదైంది. అంబర్‌పేటలో అత్యధికంగా 12.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత సైదాబాద్ మండలంలోని మల్కాపూర్‌లో 92.75 సెం.మీ.ల వర్షం నమోదైంది. ఖైరతాబాద్ మండలంలోని జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం ఆవరణలో 79.25 సెం.మీలు, అదే మండలం పరిధిలోని శ్రీనగర్‌కాలనీలో 71.75 సెం.మీలు, అలాగే మారెడ్‌పల్లి మండలంలోని వెస్ట్‌మారెడ్‌పల్లి ప్రాంతంలో 1.75 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు జిహెచ్‌ఎంసి అధికారులు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలో
హైదరాబాద్: నగర శివారు, రంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో ఆరా తీశారు. మూసి, ఈసి, కాగ్నా నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ అధికారులు తక్షణ అత్యవసర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది చెరువులు, కుంటలు తెగే పరిస్థితి అంచనా వేసి అధికారులు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య చికిత్సకు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఏదైనా ఆస్తి నష్టం, పంట నష్టం వాటిల్ని ఆ వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా పరిపాలనాధికారికి పంపాలని ఆయన సూచించారు.
16 ఏళ్ళ తర్వాత కురిసిన భారీవర్షం
వర్షాకాలంలో చెరువులు నిండక... భూగర్భ జలాలు ఇంకిపోతు శివారు ప్రాంత ప్రజలు తాగేందుకు నీరు సైతం కరవవుతున్న తరుణంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి జంట నగరాలతోపాటు శివారు మండలాలు జలమయమయ్యాయి. 16 ఏళ్ల తర్వాత ఎడతెరుపు లేకుండా తెల్లవారుజాము మూడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటవరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనుకున్నంత స్థాయిలో శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నిండకపోయినా ఫర్వాలేదనే పరిస్థితి నెలకొంది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన శివారు కాలనీలలో వర్షపునీటి వరద మోకాలు లోతులో ప్రవహించడంతో ఒక్కసారిగా పరిసర కాలనీలలో నుండి వచ్చిన వరద నీటితో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పదుల సంఖ్యలో ప్రహరీగోడలు కూలిపోవడంతోపాటు రామాంతపూర్‌లోని ప్రగతినగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇలాగే వికారాబాద్ డివిజన్ 27 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, గండ్వీడ్‌లో రెండు ఇళ్లు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో పాత భవనాలు పాక్షికంగా దెబ్బతినగా ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. బుధవారం కురిసిన తరహాలో మరో రెండు రోజులు కురిస్తే చెరువులు, కుంటలు నిండి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిలోనే మునిగి ఉండే పరిస్థితి కనిపిస్తోంది.