హైదరాబాద్

ఖాళీ చేయండి: కేటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: మహానగరంలో రానున్న మరో 36 గంటల పాటు భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేయాలని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు సూచించారు. నగరంలో బుధవారం భారీ వర్షం కురిసి, రామంతాపూర్, భోలక్‌పూర్‌లో జరిగిన దుర్ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన బుధవారం గాంధీ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆ తర్వాత ట్యాంక్‌బండ్ వద్ధ హుస్సేన్‌సాగర్ నీటిని కిందకు విడుదల చేయటాన్ని పరిశీలించారు. రామంతాపూర్, భోలక్‌పూర్ ఘటనల మృతులకు ఒక్కోక్కరికి జిహెచ్‌ఎంసి తరపున రూ. 2లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కోక్కరికి మరో రూ. 4లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరం అని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి పరిధిలో 1997 శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలను గుర్తించినట్లు, అందులో 940 భవనాలకు జిహెచ్‌ఎంసి నోటీసులు జారీ చేసిందని, మరో 95 భవనాలకు సంబంధించి యజమానులు పటిష్ట చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరో 150 భవనాలకు సంబంధించి కోర్టుల్లో కేసులున్నట్లు మంత్రి వివరించారు. ఉదయం ఏడున్నర గంటల నుంచి భారీ వర్షం కురుస్తున్నందున తానే స్వయంగా మేయర్, కమిషనర్లతో ఎప్పటికపుడు పరిస్థితిని పర్యవేక్షించినట్లు తెలిపారు. పరిస్థితిని మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు ఎమర్జెన్సీ బృందాలు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. ఎక్కడ భారీగా వర్షం నిలిచినా, చెట్లు విరిగిపడినా నగరవాసులు వెంటనే డయల్ 100, 21111111, ‘మైజిహెచ్‌ఎంసి’ యాప్ లకు ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి సూచించారు. అన్ని శాఖల అధికారులు ఎప్పటికపుడు సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను, విపత్తులను వెంటనే పరిష్కరించి ప్రజల ఇబ్బందులను దూరం చేయాలని ఆదేశించారు. మంత్రితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులున్నారు.