హైదరాబాద్

ముంచుకొస్తున్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: నగరంలో అతిభారీ వర్షం కురిసి ఏదైన విపత్తు సంభవిస్తే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ప్రజలు తమ జాగ్రత్తలో తాము ఉంటే మించిది. రానున్న మరో రెండురోజుల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ప్రస్తుతం నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న వరద నీటి కాలువలు, హుస్సేన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లోకు తగిన విధంగా ఔట్ ఫ్లో లేకపోవటం, చెరువులు కనుమరుగు కావటం, విపత్తుల నివారణ సెల్ ఉన్నా, అది కేవలం టెలిఫోన్ ఎక్స్ఛేంజిగా మారటం వంటి పరిణామాల నేపథ్యంలో నగరానికి వరద ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేగాక, బుధవారం కురిసిన మాధిరిగానే మరో రెండురోజుల పాటు వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటీ? అన్న ప్రజల ఆందోళనకు గ్రేటర్ ఇంజనీర్ ఒకరు ‘అవును గట్టిగా వర్షం పడితే ఇబ్బందులుంటాయి కదా!..అని తాపీగా సమాధానం చెప్పటం గమనార్హం. భారీ వర్షాల సూచనను ముందుగా పసిగట్టి అప్రమత్తమయ్యే పరిస్థితి దేవుడెరుగు కానీ ఎక్కడ ఎంత వర్షం కురిసిందో కూడా నమోదు చేయలేని పరిస్థితులు దాపురించాయి. బుధవారం నగరంలో ఉదయం ఏడున్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు పలు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసినా, లెక్కలు దొరకటం లేదని అధికారులు పేర్కొనటం గమనార్హం. పదిహారేళ్ల క్రితం నగరాన్ని వరదలు ముంచెత్తి భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగినపుడు మున్ముందు వరదలు రాకుండా తీసుకునే చర్యలపై కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన నివేదికల ప్రకారం, జాతీయ విపత్తుల నివారణ సంస్థ సిఫార్సుల మేరకు సర్కిల్‌కు ఒకటి చొప్పున రెయిన్ గ్వేజ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నా, నేటికీ ఫలించలేదు. గతంలో భారీ వర్షాలను కాస్త ముందుగానే పసిగట్టి ప్రాణ, ఆస్తి నష్టాలను కొంత మేరకైనా తగ్గించవచ్చునన్న ఉద్దేశ్యంతో జిహెచ్‌ఎంసి పూర్వ కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు ప్రతి అధికారి సెల్‌ఫోన్‌కు నేరుగా వాతావరణ శాఖ హెచ్చరికలు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. పదహారేళ్ల క్రితం సంభవించిన వరదలతో పాలకులు, జిహెచ్‌ఎంసి అధికారులు కూడా ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో ఎంత వర్షం కురిసినా, వరద నీరు సక్రమంగా ప్రవహించేందుకు వీలుగా వరద నీటి కాలువల ఆధునీకరణకు అప్పట్లో రూ. 6వేల కోట్లతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన అధికారులు దాన్ని పక్కన బెట్టారు. మూడేళ్ల క్రితం తీరా ఆ అంచనా వ్యయం రూ. 10వేల కోట్లకు పెరిగింది. దీంతో పాటు హుస్సేన్‌సాగర్‌కు హెచ్చరిక వ్యవస్థ, ఇన్‌ఫ్లోకు తగిన విధంగా నీరు బయటకు విడుదల చేసేందుకు ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సైతం రూపకల్పన చేసి పక్కన పారేయటమే గాక, భారీ వర్షాలు కురిసి విపత్తులు సంభవించినపుడు కనీసం ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించే రకంగా విధులు నిర్వర్తించే విపత్తుల నివారణ సెల్‌ను కూడా ఏర్పాటు చేయలేకపోవటం వరదల నుంచి నగరాన్ని రక్షించటంలో జిహెచ్‌ఎంసి వైఫల్యాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
పేరుకే విపత్తుల నివారణ
జిహెచ్‌ఎంసి విపత్తుల నివారణ సెల్‌ను ఏర్పాటు చేసినా, కేవలం ఓ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, అటెండర్‌ను నియమించి చేతులెత్తేసింది. ఇపుడు ఇంజనీర్ సుధాకర్ కూడా రెండురోజుల క్రితం రిటైర్డు అయ్యారు. ప్రస్తుతం విపత్తుల నివారణ అనేది కేవలం ఓ టెలిఫోన్ ఆపరేటర్‌కే పరిమితమైంది. ఇతర విభాగాధిపతులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారని చెబుతున్నా, ఫోన్‌లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదును కేవలం సంబంధిత విభాగానికి మళ్లిస్తారే తప్పా, వీరు క్షేత్ర స్థాయి విధులేమీ నిర్వహించరు. సమస్యకు సంబంధించి క్షేత్ర స్థాయిలో తీవ్రత ఎలా ఉందో విభాగాధిపతులకు తెలిసేంత వరకు సదరు సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదు.