హైదరాబాద్

విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న తెరాస సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, సెప్టెంబర్ 1: తెరాస ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గత మూడు సంవత్సరాలుగా విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తమ సిబ్బందికి జీతాలు చెల్లించకలేకపోవడంతో కళాశాలలకు ఏకంగా తాళాలు వేసి రోడ్లమీద ధర్నాలు చేసే దుస్థితి తెరాస ప్రభుత్వంలో నెలకొందన్నారు. మరోవైపువిద్యార్థులు ఫీజుబకాయిలు చెల్లించాలంటూ చదువులు నిలిపివేసి, కళాశాలల యాజమాన్యాలు రోడ్డెక్కితే, ఆరోగ్యశ్రీ బకాయిలంటూ ఆసుపత్రుల యాజమాన్యాలు రోగుల సేవలు నిలిపివేయడం చూస్తుంటే, ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ ఇదేనా? అనిపిస్తుందన్నారు. ధనిక రాష్టమ్రని ప్రకటనలు చేసిన ధనిక సిఎం కెసిఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌లో విశ్రాంతిలో ఉంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని చిలుకు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే విద్యార్థులకు రావాల్సిన 3500 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందని పక్షంలో విద్యార్థులే ఫీజులు చెల్లించాలని లేనిపక్షంలో సర్ట్ఫికెట్‌లు ఇవ్వలేమని వత్తిడి తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం తమకు అనుకూలంగా కాంట్రాక్టర్‌లకు ప్రాజెక్టులు కేటాయించుకుంటూ కమీషన్ల కోసం పాకులాడడం అటుంచితే విద్యార్థుల జీవితాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని, ధనిక రాష్టమ్రని ప్రకటించి కనీసం విద్యార్థులకు ఫీజులు చెల్లించలేని సిఎం నియంతృత్వ పోకడలకు స్వస్తిపలకాలని అన్నారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు వారం రోజుల్లో విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చిలుక హెచ్చరించారు.