హైదరాబాద్

వర్షంతో భారీగా రోడ్లు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: మూడురోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షంతో నగరంలోని 55వేల 850 చదరపు మీటర్ల రహదార్లు దెబ్బతిన్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు గుర్తించారు. అన్ని ప్రధాన రహదార్లలో దాదాపు 3వేల పై చిలుకు గుంతలు ఏర్పడినట్లు గుర్తించినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంతేగాక, భారీ వర్షంతో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేకంగా సర్వే నిర్వహించాలని ఆయన ఇంజనీర్లను ఆదేశించారు.
వర్షంతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు సుమారు రూ. 22 కోట్ల వరకు ఖర్చవుతుందని ఇంజనీర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకు గాను నగరంలోని రోడ్లపై ఏర్పడిన గుంతలు, దెబ్బతిన్న రహదార్లకు వెంటనే మరమ్మతులను యుద్దప్రాతిపదికన చేపట్టి, వీలైనంత త్వరగా పునరుద్దరించాలని ఆదేవించారు. జిహెచ్‌ఎంసి అధికారులతో ఆయన శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నందున రహదార్లకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదఏవించారు. ముఖ్యంగా మినిష్టర్ రోడ్డు, నెక్లెస్‌రోడ్‌లతో పాటు ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నింటికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వెంటనే పనులు చేపట్టాలన్నారు. గణేష్ నిమజ్జన శోభయాత్రలు సాఫీగా జరిగేందుకు వీలుగా ఈ యాత్ర కొనసాగే రూట్‌లో రోడ్డుకిరువైపు అడ్డంగా వస్తున్న చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. వర్షాల వల్ల నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికపుడు నీటిని తోడేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో రోడ్ల సమస్యలపై అందే ఫిర్యాదులను సైతం తక్షణమే పరిష్కరించాలని, అదే విధంగా నగరంలోని రహదార్లపై ఏర్పడిన గుంతలు, దెబ్బతిన్న రోడ్లు, నీటి నిల్వలు తదితర సమస్యలపై వెంటనే స్పందించాలని సూచించారు.
కొనసాగుతున్న నోటీసుల పంపిణీ
నగరంలో పురాతన కట్టడాలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలను ముందుజాగ్రత్తగా వెంటనే ఖాళీ చేయాలని సూచిస్తూ అధికారులు చేపట్టిన నోటీసుల పంపిణీ ముమ్మరమైంది. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో ఇప్పటి వరకు 285 పైగా ఇళ్లను కూల్చివేయగా, మిగిలిన 800లకు పైగా పురాతన భవనాలను ఖాళీ చేయాలని టౌన్‌ప్లానింగ్ అదికారులు ప్రతి ఇంటికెళ్లి గోడలపై నోటీసులను అతికించటంతో పాటు, అక్కడి ఇంటి యజమానుల సంతకాలను కూడా సేకరిస్తున్నారు. పోలీసుల సహయంతో ప్రమాదకరంగా మారిన ఇళ్లను కూల్చివేస్తున్నట్లు కూడా అధికారులు తెలిపారు. గత నెలాఖరు రోజున దాదాపు 15 భవనాలు, సెప్టెంబర్ 1వ తేదీన 19, 2న 16 భవనాలను జిహెచ్‌ఎంసి సిబ్బంది కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు భారీ వర్షాలతో గోడలు బాగా నాని కూలి ప్రాణ నష్టం సంభవించే ప్రమాదమున్న వాటిని వెంటనే ఖాళీ చేయించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
రోడ్లకు మరమ్మతులు
నగరంలో భారీ వర్షంతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులను చేపడుతున్నారు. ఇప్పటికే వర్షాల వల్ల ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియను కొనసాగిస్తూనే మరో వైపు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వెల్లడించారు. 119 అత్యవసర బృందాలు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చివేస్తున్నట్లు, ఈస్ట్‌జోన్‌లో 23, సౌత్ జోన్‌లో 12, సెంట్రల్ జోన్‌లో ఆరు, వెస్ట్‌జోన్‌లో 21, నార్త్‌జోన్‌లో 26ప్రత్యేక బృందాల ద్వారా గుంతలను పూడ్చివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 31న 273, సెప్టెంబర్ 1న 280, 2న 300 పై చిలుకు గుంతలను జిహెచ్‌ఎంసి పూడ్చినట్లు కమిషనర్ తెలిపారు.