హైదరాబాద్

చవితి సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: నిత్యం యాంత్రిక జీవనానికి అలవాటు పడిన నగర జీవిని ఏడాదికొసారి పదకొండు రోజుల పాటు ఆధ్యాత్మికత వైపు ఆకర్షించే అరుదైన వేడుకలు వినాయక చవితి ఉత్సవాలు. పదకొండు రోజుల పాటు భక్తుల నుంచి ఘనంగా పూజలందుకునే విఘ్నేశ్వరుడ్ని ప్రతిష్టించేందుకు నగరంలోని యువజన, కాలనీ, సంక్షేమ సంఘాలతో పాటు అపార్ట్‌మెంట్లలోనూ వినాయకుడ్ని ప్రతిష్టించుకునేందుకు వేదికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు శివార్లలోని పలు కాలనీ , అపార్ట్‌మెంటు సంఘాలు వినాయక విగ్రహాలను తరలించటంలో నిమగ్నమయ్యాయి. విగ్రహాల విక్రయానికి పేరుగాంచి ధూల్‌పేట పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి జోరుగా సాగుతున్న విగ్రహాల తరలింపు శనివారం నుంచి మరింత ఊపందుకోంది. ఆదివారం సెలవురోజు కావటంతో ఎక్కువ మంది మండ నిర్వాహకులు శనివారం అర్థరాత్రి నుంచి విగ్రహాలను తరలించేందుకు సిద్దం కావటంతో పోలీసులు దూల్‌పేట, మంగల్‌హాట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. అయితే నగరంలో నాలుగైదు అడుగుల ఎత్తు మొదలుకుని 15, 20 అడుగుల ఎత్తు కల్గిన సుమారు 40వేల విగ్రహాలు ప్రతిష్టించే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్న పోలీసులు ఈ సారి నిమజ్జనాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మధ్యలో 12వ తేదీన బక్రీద్ పండుగ రావటంతో పోలీసులు నిమజ్జనం ఊరేగింపును సవాలుగా తీసుకున్నారు. ఇందుకు గాను 20వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం గ్రేటర్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకునే ఖైరతాబాద్ భారీ గణపయ్య సైతం తుది మెరుగులు దిద్దుకుని సోమవారం నుంచి భక్తులకు ఆశీర్వచనాలు పలికేందుకు సిద్దమయ్యాడు. ఇక వివిధ ప్రాంతాల్లో మండపాలను నిర్వాహకులు చూడముచ్చటగా ఏర్పాటు చేయటంలో నిమగ్నమయ్యారు. నగరంలో పేరుగాంచి ఖైరతాబాద్, చపల్ బజార్, బేగంబజార్, సికిందరాబాద్ మోండా మార్కెట్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో ప్రతిష్టించనున్న భారీ గణపయ్యలకు వేదికలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి.
మండప, పూజ సామాగ్రికి యమ గిరాకీ!
వినాయకుడ్ని ప్రతిష్టించేందుకు ఏర్పాటు చేయనున్న మండపాలు మొదలుకుని, పూజా సామాగ్రి వరకు ధరలు ఆకాశాన్నంటాయి. మండపాలను ఏర్పాటు చేసే తట్టీలు వంటివి, అలాగే షామియానాలు, స్టేజీలు, విద్యుత్ దీపాలు, మైక్‌సౌండ్‌ల వంటివి రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ, బేగంబజార్, సికిందరాబాద్ ప్రాంతాల్లో మండప నిర్వాహకులు పోటాపోటీగా మండపాలను ముస్తాబు చేస్తున్నందున ఈ ప్రాంతాల్లో ధరలకు రెక్కలొచ్చాయి. ఇక పూజా సామాగ్రిలో ముఖ్యమైన పూలు, పండ్ల ధరలు శనివారమే కొనుగోలుదారులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసే స్థాయికి పెరిగాయి.

సాక్షర భారత్ అవార్డుకు ఎంపికైన బాకారం గ్రామం

హైదరాబాద్, సెప్టెంబర్ 3: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని బాకారం గ్రామం సాక్షర భారత్ అవార్డు 2016కు ఎంపికైంది. ఈ నెల 8వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ బాలభవన్‌లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ బద్దుల సుధాకర్ యాదవ్, జిల్లా వయోజన విద్య ఉప సంచాలకులు వి.రాందాస్ నాయక్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. బాకారం గ్రామం జిల్లాలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉంటుంది. గ్రామంలో అక్షరాస్యత కార్యక్రమాలను ముమ్మరం చేసి సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేసిన సర్పంచ్, వార్డు సభ్యులు, యువజన సంఘాలు, వయోజన క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప సంచాలకులు రాందాస్ నాయక్ అభినందించారు. ఈ గ్రామాన్ని విశ్రాంత ఐఎఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచారి దత్తత తీసుకుని గ్రామాభివృద్ధికి సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేశారని పేర్కొన్నారు. విజయం స్వచ్చంద సంస్థ అధినేత డాక్టర్ ఎంఎస్ గౌడ్, రోటరీ క్లబ్ సెంట్రల్, అలీప్ స్వచ్చంద సంస్థల సహకారం ఐబిఎం సాఫ్ట్‌వేర్ కంపెనీ కిరణ్‌కు ప్రత్యేక అక్షర సుమాంజలు తెలిపారు.