హైదరాబాద్

వినాయక చవితి, బక్రీద్ పండగలకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: వినాయక చవితి, బక్రీదు పండుగలు ఒకేసారి వస్తున్నందున నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. నగరవ్యాప్తంగా 40వేలకు పైగా వినాయక మండపాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. శనివారం బక్రీదు, వినాయక చవితి పండుగల సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించింది. సాలార్జంగ్ మ్యూజియం కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో పలువురు రాజకీయ నాయకులు, వివిధ శాఖల అధికారులతోపాటు మత పెద్దలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్ నగరంలో హిందూ, ముస్లింలు పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సిపి కోరారు. వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని రహదారుల్లో, వినాయక మండపాల వద్ద సిసి కెమెలు ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూంతో సిసి కెమెరాలను అనుసంధానం చేస్తామని చెప్పారు.
గోవధ చట్టాన్ని అమలు చేస్తామని, నగరంలో 20 వేల పోలీసు సిబ్బందితో 40 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న ఆంక్షలు, గోవధ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ హెచ్చరించారు. గోవధ చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకొని అరాచకాలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
పాతబస్తీలో, మసీదుల వద్ద 150 భారీ వాహనాలను అందుబాటులో పెడతున్నామని, 300 ఆటోలు, లక్షకు పైగా కవర్లను ఏర్పాటు చేసి వ్యర్థాలను తొలగించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్నివర్గాల ప్రజలు సంయమనం పాటించి స్వేచ్ఛాయుత వాతావరణంలో బక్రీదు, వినాయక చవితి పండుగలను నిర్శహించుకోవాలని కమిషనర్ నగరవాసులను కోరారు. నగర శివారుల్లో కూడా గట్టి భద్రత చర్యలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.