హైదరాబాద్

భూ రికార్డుల కంప్యూటరీకరణతో ఇబ్బందులు రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 3: భూ వివరాలను తెలుసుకునేందుకు చేసిన కంప్యూటరీకరణతో రైతుల ఇబ్బందులు రెట్టింపు అయ్యాయని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కిసాన్ ఖేత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో భూమి రికార్డులు - అవకతవకలు, ఆహార పంటల్లో జన్యూమార్పిడి అనే అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. న్యాయవాది రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, కాంగ్రెస్ నేతలు కోదండ రెడ్డి, మల్లు రవి, ఇంద్రశోభన, మహేష్, టిడిపి నేత ఓంటెర్ ప్రతాప్‌రెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత అచ్యుత రామారావు, బిజేపీ నాయకుడు వెణుగోపాల్‌రె, వెంకటేశ్వర రావు, మాజీ ఐఏఎస్ గోపాల్ రావు, సంఘాల నాయకులు నర్సింహారెడ్డి మాట్లాడారు. ఆన్‌లైన్ విధానంలో భద్రత లేకుండా పోతుందని, ప్రజాప్రతినిధులు, బలవంతులు తమ తెలివితో చదువురాని వారిని నుంచి భూములను దోచుకునేందుకు ఈ విధానం తోడ్పడేలా ఉందన్నారు. అవినీతిని తగ్గించేందుకు అని చెబుతున్నా ఎక్కడా అవినీతి తగ్గలేదని అన్నారు. ఆన్‌లైన్‌లో ఓ విధంగా ఉంటే పట్టాదార్ పాస్‌బుక్‌లో మరోవిధంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిస్తుందన్నారు. అనాగరిక పద్ధతులకు డిజిటలైజేషన్ ఉపయోగకరంగా మారుతుందని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్ - ఆన్‌లైన్ వ్యవస్థలకు మధ్య సరిచేసే వ్యవస్థ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూ విక్రయాలు, తాత, తండ్రుల మృతి చెందినప్పుడు వారి పేర్లను మార్చుకునేందుకు రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితిని తొలగించకుండా డిజిటలైజేషన్ ఎందుకు అని ప్రశ్నించారు. పకడ్బందీగా అమలు చేయగలిగితే డిజిటలైజేషన్‌తో లబ్ధి చేకూరుతుందని కొందరు అభిప్రాయపడ్డారు. భూ రికార్డుల విషయమై మరింత లోతైన చర్చ జరగాల్సి ఉందని, చదువురాని వారికి సైతం ఉపయుక్తమైన విధంగా దీనిని రూపొందించినప్పుడే ఆశించిన ఫలితం వస్తుందన్నారు.