హైదరాబాద్

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: అంతర్జాతీయ స్థాయిలో హాకీ జట్టు రాణించాలని రాష్ట్ర మంత్రి పి. మహేందర్‌రెడ్డి కోరారు. రాష్ట్ర బాలికల విభాగంలో హాకీ పోటీలలో విజేతలుగా నిలిచిన రంగారెడ్డి జిల్లా జట్టును మంగళవారం అభినందించారు. జిల్లాలో ఎంతో మంది ఉత్తమ ప్రతిభావంతులైన క్రీడాకారులున్నా, గత పాలకులు పట్టించుకోలేదని చెప్పారు. కోచ్ లేకున్నా జిల్లా మహిళా జట్టు పిడిలు, జిల్లా సీనియర్ క్రీడాకారుల సహకారంతో తమ ప్రతిభను చాటుతూ విజేతలుగా నిలిచారని అన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని హాకీ జట్టుకు ప్రత్యేకంగా కోచ్‌ను నియమించి ఉత్తమ శిక్షణ ఇస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మినీ స్టేడియంల ఏర్పాటు, మండల, జిల్లా, జాతీయ స్థాయి క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం, ఉత్తమ క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన హయత్‌నగర్‌కు చెందిన క్రీడాకారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు చెన్నా కేశవరెడ్డి, ఎస్టీయు అధ్యక్షుడు బాలకృష్ణ, హయత్‌నగర్ హెచ్‌ఎం శ్రీనివాస్, జిల్లా హాకీ జనరల్ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి, మేనేజర్ నిహారిక పాల్గొన్నారు.