హైదరాబాద్

మార్పులకు అనుగుణంగా మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: సమాచార, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటేనే విధులను మరింత వేగంగా నిర్వర్తించగలరని ప్రభుత్వ సలహాదారు ఎ.కె.గోయల్ సూచించారు. మంగళవారం అర్థగణాంక శాఖ డైరెక్టరేట్‌లో మంగళవారం ఆయన అధికారులకు మొబైల్ యాప్, జియో టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ ఐటి రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతుందని, నూతన ఆవిష్కరణలను ఉద్యోగులు తన దైనందిన కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలన్న లక్ష్యంతో అర్థగణాంక శాఖ స్టాటెటికల్, డిప్యూటీ స్టాటెటికల్ అధికారులకు ట్యాబ్‌లు పంపిణీ చేసినట్లు వివరించారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లి స్థాయిల్లో వర్షపాతం, పంటలు, పశుసంపద వంటి ప్రధానమైన రంగాలకు సంబంధించిన డేటాను క్షేత్ర స్థాయిలో సేకరించి సకాలంలో కార్యాలయాలకు పంపాలన్నారు. ఐటి వ వినియోగంతో కొంత మంది ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడుతుందని, నూతన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగం నిమిత్తం కొంత శిక్షణ అవసరమైనా, వాటి వినియోగం వల్ల ఉద్యోగులకు వచ్చిన ఢోకా ఏమీ లేదని, వాస్తవాని విధి నిర్వహణ మరింత సులభతరమవుతోందని ఆయన వివరించారు. ప్రభుత్వ శాఖల్లో తొలిసారిగా కంప్యూటర్లు వినియోగించింది ప్రణాళిక శాఖేనని ఆయన గుర్తుచేశారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు తమను తాము మార్చుకోవాలన్నారు. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ కేంద్రం అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జియో టెక్నాలజీ అనే పదం రిమోట్ సెన్సింగ్‌కు సమగ్రమైన పదమని, భూమి ఉపరితలంలోనికి సంబంధించిన సమాచారాన్ని తెల్సుకోవటంలో ఈ టెక్నాలజి కీలకపాత్ర వహిస్తుందన్నారు. అర్థగణాంక శాఖ విధుల్లో ముఖ్యమైన డేటా సేకరణలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ డైరెక్టర్ మీరా మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని శీఘ్రంగా సేకరించేందుకు జియో టెక్నాలజి ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
మంగళవారం నుంచి 5 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని, రోజుకి 2 జిల్లాల చొప్పున మొత్తం పది జిల్లాల నుంచి ఎస్‌వోలు, డిప్యూటీ ఎస్‌వోలు ఈ కార్యక్రమానికి హజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో అర్థగణాంక శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ప్రణాళిక శాఖ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.