హైదరాబాద్

ఉరుకులు.. పరుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: మహానగర పోలీసులకు ఈ నెలాఖరు వరకు ఉరుకులు పరుగులు తప్పేట్టు లేవు. నగరంలో శాంతిభద్రతలను ప్రభావితం చేసే ఇరువర్గాలకు చెందిన పండుగలు వరుసగా రావటం, ఆపై ఇదే నెలలో రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు నగరంలోనే జరుగుతుండటం పోలీసులకు తలభారంగా మారింది. ఇందులో భాగంగా గురువారం నుంచి మూడు రోజుల పాటు రెండు సెషన్లలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల బందోబస్తు, భద్రత, పార్కింగ్ నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ బుధవారం వివిధ విభాగాలకు చెందిన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ గురువారం నుంచి మూడు రోజుల పాటు అంటే శనివారం వరకు సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు నగర హైదరాబాద్ పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా బందోబస్తు చేపట్టనున్నరు. ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రెండు సెషన్లుగా అసెంబ్లీ జరుగుతున్నందున పోలీసులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల కల్లా ఈ సమావేశాలు ముగిసిన తర్వాత కేవలం ఒక్క రోజు గ్యాప్ తర్వాత 12న బక్రీద్ పండుగ బందోబస్తు చేయాల్సి ఉంది. ఆ ఒక్క రోజు గ్యాప్‌లో కూడా పోలీసులకు ఉరుకులు, పరుగులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సారి అక్రమంగా గోవులను తరలించటాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పకడ్బందీగా నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ గో రవాణాను అడ్డుకునేందుకు నగరంలో 20, సైబరాబాద్ మరో 15 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక, బక్రీద్ పండుగ జరిగే 12న పాతబస్తీతో పాటు న్యూ సిటీలోని వివిధ సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేగాక, అప్పటికీ మండపాల్లో వినాయకులు కొలువుదీరి ఉంటున్నందున బక్రీద్ బందోబస్తు, జంతు వధతో వచ్చే వ్యర్థాలను తరలించటం పోలీసులకు, జిహెచ్‌ఎంసి అధికారులకు తలభారంగా మారనుంది. ఎలాగోలాగ బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరిగిందా? లేదా? అనుకున్న రెండురోజులకే గణేష్ నిమజ్జనం రానే వస్తుంది. ఇక ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు గణేష్ శోభయాత్ర జరిగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు, బ్యారికేడ్ల నిమిత్తం ఇరవై నాలుగు గంటల ముందే ఆధీనంలోకి తీసుకోవల్సి ఉంది. నిమజ్జనం ముగిసిన తర్వాత ఈ నెల 20 నుంచి నెలాఖరు వరకు పదిరోజుల పాటు మళ్లీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున ఈ నెల మొత్తం పోలీసులకు బందోబస్తు జ్వరం పట్టనుందని చెప్పవచ్చు.
నేటి నుంచి నగరంలో ఆంక్షలు
వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా నగరంలో గురువారం నుంచి పోలీసులు ఆంక్షలు విధించారు. హై వాల్యుమ్ మైకులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ నెల 8 నుంచి 22 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. నివాస ప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబుల్స్, రాత్రి సమయాల్లో 45 డెసిబుల్స్‌ను మించరాదని ఆయన సూచించారు. కమర్షియల్ ప్రాంతాల్లో పగటిపూట 65 డిసెబుల్, రాత్రి సమయాల్లో 55 డెసిబుల్ మించరాదని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్న పిల్లలు, విద్యార్థులు, రోగులు, వృద్ధులు ధ్వని (పెద్దశబ్దం)తో ఇబ్బందులు పడతారని అన్నారు. నిమజ్జన సందర్భంగా జరిగే సమావేశాల్లో డిజెలు వాడరాదని, ప్రజలకు అసౌకర్యం కల్గించకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. గణేశ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానిత వస్తువులు, వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా..అనుమానం కలిగిన వస్తువులు కనిపించినా వెంటనే సమీపంలోని పోలీసులకు తెలియజేయాలని కమిషనర్ సూచించారు.