హైదరాబాద్

కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: మూడు ముక్కలవుతున్న రంగారెడ్డి జిల్లాలో కొత్త కలెక్టరేట్ భవనాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఉద్యోగుల విభజన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న జిల్లా యంత్రాంగం మూడు జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల విభజనతో పాటు పాతరికార్డులను (ఫైళ్లను) కంప్యూటరీకరణ చేసేందుకు ఉద్యోగులు రాత్రి పగలు పనిచేస్తున్నారు. కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించిన సుమారు 80వేల ఫైళ్లను స్కానింగ్ చేసేందుకు షిఫ్ట్‌ల వారీగా ఉద్యోగులు 24 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పటికే సుమారు 10 వేల ఫైళ్లు స్కానింగ్ చేసి వివరాలను కంప్యూటరీకరించిన అధికారులు ఈ ప్రక్రియను ఈనెల 24లోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త కలెక్టరేట్ భవనాల నుండి పరిపాలనను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని కీసర, మేడ్చల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుకీసర, మేడ్చల్ ప్రాంతాల్లో పర్యటించి ఇంజనీరింగ్ కళాశాలలను పరిశీలించారు. వికారాబాద్‌లో టిబి ఆసుపత్రి ప్రాంగణంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్వహించేందుకు దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. ప్రస్తుతం లక్డీకాపూల్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో శంషాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్వహించాలా లేక శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త భవనాన్ని చూసి అక్కడి నుండి పరిపాలన అందించాలన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
దసరాకు కొత్త జిల్లాల మనుగడ ప్రారంభం..
రంగారెడ్డి జిల్లాలో జిల్లా పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడుతున్న మూడు జిల్లాల కార్యాలయాలను దసరా రోజున ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లను ముమ్మరం చేసిన నేపథ్యంలో కొత్త కార్యాలయాలను ముగ్గురు మంత్రులతో ప్రారంభింప చేయనున్నారు. శంషాబాద్ జిల్లా కార్యాలయాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభించాలని, మల్కాజ్‌గిరి కార్యాలయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ప్రారంభింపజేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. అలాగే రంగారెడ్డి జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డి వికారాబాద్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.