హైదరాబాద్

విద్యతో పాటు విలువలూ నేర్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతో పాటు విలువలూ నేర్పుతూ, వారు సమాజ అభివృద్ధికి తోడ్పడేలా తీర్చిదిద్దాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి. సుభాషణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లా శాఖ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రవీంద్రభారతి మినీ హాల్‌లో బుధవారం గురుపూజోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన సుభాషణ్‌రెడ్డి ఈ సందర్భంగా పలువురు ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులను సన్మానించారు. తత్వవేత్త, విద్యావేత్త అయిన రాధాకృష్ణన్ స్పూర్తితో విద్యార్థులు ఎదగాలని, అదే విధంగా గురువులను స్మరించుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు, తరువాత సామాజిక, ఆర్థిక, అక్షరాస్యత, ఆరోగ్య, ఇతర జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి నెమరేసుకోవాలన్నారు. దేనినైనా సమాజాభివృద్ధికి ఉపయుక్తంగా ఉండేలా ఆచరణలో పెట్టినపుడే సార్థకత చేకూరుతుందన్నారు. 6 నుంచి 14 సంవత్సరాల్లోపు వయస్సులోపు పిల్లలందరికి తప్పనిసరిగా విద్యనందించేందుకు విద్యా హక్కు చట్టం వచ్చిందని, కానీ ఆ చట్టం అమల్లోకి వచ్చేందుకు రెండేళ్లు పట్టిందన్నారు. విద్య పిల్లల ప్రాథమిక హక్కు అని అన్నారు. విద్యార్థులకు మంచి వాతావరణంలో అన్ని వౌలిక సదుపాయాలతో విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తుచేవారు. మానవ వికాసానికి విద్య ఒక పునాది అని, ప్రమాణాలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. గురువులను ఎపుడూ మరవద్దని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకుని వృద్ధి చెందాలన్నారు. డ్రాప్‌అవుట్స్ ఎక్కువగా ఉంటాన్నారని, అందులో అధికంగా బాలికలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు పాఠశాలల్లో నీటి వసతి, మరుగుదొడ్ల సదుపాయం, వౌలిక వసతులు లేకపోవటమే ప్రధాన కారణమన్నారు. చట్టాలు ఎన్ని చేసినా వాటిని ఆచరణల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు రాహుల్ బొజ్జా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో గురువునకు దేవునితో సమానమైన స్థానాన్ని ఇవ్వటం జరుగుతుందని, అలాంటి ఉపాధ్యాయులు తమకిచ్చిన గౌరవానికి తగినట్టుగా విద్యార్థులను భావితరాలకు అందించాలన్నారు. తమ వృత్తికి బాధ్యతతో న్యాయం చేకూర్చేలా చూసుకోవాలన్నారు. ప్రతి ఉపాధ్యాయులు విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన బాధ్యతలను తీసుకుంటూనే తాము ఆచరిస్తూ ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో కీలకపాత్ర పోషించేది ఉపాధ్యాయులేనని, అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైందని వివరించారు. బాధ్యతాయుతమైన సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల వృత్తి ముఖ్యమైందని అన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ మామిడి అనంతరెడ్డి, సొసైటీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె. మదన్‌మోహన్‌రావు, హైదరాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ భీంరెడ్డి, సెక్రటరీ కె. సుదర్శన్‌రెడ్డి, ప్రొగ్రాం కన్వీనర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.