హైదరాబాద్

గణనాథులకు ‘ఘన’ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చార్మినార్, సెప్టెంబర్ 7: వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ భాగ్యనగరం భక్తిపారవశ్యంలో మునిగి తేలుతోంది. ముఖ్యంగా నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో అడుగడుగున గణేష్ మండపాలు దర్శనమిస్తూ, వీధులన్నీ విద్యుత్ దీపాల అలంకరణతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. నగరంలో కనిష్టంగా అడుగు ఎత్తు మొదలుకుని ఖైరతాబాద్ బడా గణపయ్య వరకు ప్రతి మండపంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు జరుగుతున్నాయి. సుమారు 40వేల వరకు విగ్రహాలు ప్రతిష్టించినట్లు అంచనాలున్నా, అన్ని విగ్రహాల కన్నా ఖైరతాబాద్ గణపతి వద్ధ భక్తుల సందడి వర్ణణాతీతం. చవితి వేడుకలు ప్రారంభమై నాలుగోరోజుకి చేరుకోవటంతో నిమజ్జనం కోసం వివిధ ప్రభుత్వ శాఖలు ట్యాంక్‌బండ్ వద్ధ సర్వం సిద్దం చేశాయి. అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజుల్లో జరిగే నిమజ్జనం కోసం కాస్త ముందుగానే ఏర్పాట్లు చేశారు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాలు, బేగంబజార్, చపల్‌బజార్, సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాధులను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. అలాగే మోండామార్కెట్‌లలో కొలువుదీరిన గణనాధులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.
ట్యాంక్‌బండ్ చుట్టూ ట్రా‘్ఫకర్’
వినాయక చవితి వేడుకలు ప్రారంభమై బుధవారానికి మూడురోజులు చేరటంతో పలు విగ్రహాలను మండప నిర్వాహకులు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి నిమజ్జన సందడి ప్రారంభం కాగానే, ట్యాంక్‌బండ్, అంబేద్కర్ విగ్రహాం, లిబర్టీ చౌరస్తా, బూర్గుల రామకృష్ణారావు జంక్షన్లతో పాటు దోమల్‌గూడ, లోయర్ ట్యాంక్‌బండ్, ఇందిరాపార్కు, రాణిగంజ్ చౌరస్తా, వైస్రాయ్ చౌరస్తాల్లో ట్రాఫిక్ జాం అయింది.
బాలానగర్‌లో..
బాలానగర్: బాలానగర్ డివిజన్ శ్రీశ్రీనగర్‌లో గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫతేనగర్ డివిజన్ పరిధిలొని పైపులైన్ రోడ్డులో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఎమ్మెల్సీ పూల రవీందర్, కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సాగర్‌రావు, గంగారాజు, కృష్ణకుమారి, సూర్యం, సురేష్, సుదర్శన్‌రెడ్డి, పురుషోత్తం పాల్గొన్నారు.
బోయిన్‌పల్లిలో..
అల్వాల్: బోయిన్‌పల్లి లో రాణప్రతాప్ యువ సేనా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి. సాయన్న ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆయనతోపాటు కంటోనె్మంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్, సీనియర్ నాయకుడు టిఎన్ శ్రీనివాస్, బోర్డు సభ్యులు జె.రామకృష్ణ, కె.పాండు యాదవ్ తోపాటు నిర్వహకులు పాల్గొన్నారు. మచ్చబొల్లారం డివిజన్‌లో వినాయక మండపం పూజలో పాల్గోన్న స్థానిక కార్పొరేటర్ రాజ్‌జీతేంద్రనాథ్, తోపాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వెంకటాపురంలో వినాయక మండపం పూజలో పాల్గొన్న కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ సతిసమేతంగా పాల్గొన్నారు.

‘బుద్దుని సంయుక్త సంభాషణలు’ గ్రంథావిష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 7: లతారాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సద్ధర్మ మహోపాధ్యాయ’ అన్నపరెడ్డి బుద్ధఘోషుడు పాళీ భాష నుండి తెలుగులోకి అనువదించిన ఆరు భాగాలు ‘బుద్దుని సంయుక్త సంభాషణలు’ను బుధవారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ ఆరు గ్రంథాలను ఐఎఎస్ అధికారి ఆర్.సుబ్బారావు, గార్గేయ, ఐఎఎస్ అధికారి విద్యాసాగర్, నాల్గవ గ్రంథం ప్రచురణకు సహకరించిన నలుగురికి ఎమ్మెస్ భూషి, శ్రీరామమూర్తికు మొదటి కాపీలు అందించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ సామాజిక విజ్ఞానం అందిస్తూ మానవ వికాసానికి ఈ గ్రంథం ఉపయోగపడాలని అన్నారు. ఈ దేశానికి సనాతన ధర్మం వుందని, బుద్దుని జీవితం గురించి ఆయన ప్రస్తావించారు. కార్యక్రమానికి ‘్ధర్మదీపం’ ఫౌండేషన్ చైర్మన్ చెన్నూరు ఆంజనేయరెడ్డి, ముఖ్యఅతిధిగా పాల్గొనగా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఈమని శివనాగిరెడ్డి, ముంగర జాషువా పాల్గొన్నారు. తొలుత సంస్థ వ్యవస్థాపకులు మేనేజింగ్ ట్రస్ట్ కెకె రాజా స్వాగతం పలుకుతూ సంస్థ కార్యకలాపాలు వివరించారు.
సికింద్రాబాద్ కాప్రా చెరువుపై
వారంలోగా నివేదిక ఇవ్వాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 7: సికింద్రాబాద్‌లోని కాప్రా చెరువును కాలుష్యం బారి నుంచి రక్షించేందుకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరుతూ హైకోర్టు బుధవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి, జిహెచ్‌ఎంసిని ఆదేశించింది. హైకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాపా లేక్‌వ్యూ రెసిడెంట్స్ సంఘం ఈ పిల్‌ను దాఖలు చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్ విజయ్ వాదనలు వినిపిస్తూ, బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ చెరువుపూర్తిగా కాలుష్యం అయిందని, దీనికి సంబంధించిన శాస్ర్తియ వివరాలను కోర్టుకు తెలిపారు. అనంతరం వారంరోజుల్లోగా కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.