హైదరాబాద్

జనం చస్తుంటే మీరేం చేస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: అసలే వర్షాకాలం..మేం ఎన్నిసార్లు చెప్పాం..ఎప్పటికపుడు దోమలను నివారించేందుకు యాంటీలార్వా ఆపరేషన్, ఫాగింగ్ చేయాలని..మీరు విన్పించుకోరు..డెంగీ వచ్చి చిన్నపిల్లలు చనిపోతుంటే మీరు తమాషా చూస్తున్నారా? మీకు మీరేమనుకుంటున్నారు..మిమ్మల్ని సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్ తీస్తా...! అంటూ తీవ్ర స్థాయిలో జిహెచ్‌ఎంసి అధికారులపై అసహనాన్ని వ్యక్తం చేశారు మజ్లిస్ కార్పొరేటర్లు. మహానగరాభివృద్ధి, నగరవాసులకు మెరుగైన పౌరసేవలతో పాటు కార్పొరేషన్ పరిపాలనపరమైన నిర్ణయాల్లోనూ కీలక పాత్ర పోషించే స్థారుూ సంఘం గురువారం ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన మరోసారి సమావేశమైంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అహ్మద్‌నగర్ డివిజన్‌లోని నషేమన్ హోటల్ సమీపంలో డెంగీ వ్యాధితో మహ్మద్ ముర్తుజా అలీ ఖాన్ అనే బాలుడు మృతి చెందటం, అతని తమ్ముడికి వ్యాధి నిర్థారణ కావటంతో స్థానిక కార్పొరేటర్ అయేషా రుబీనా, కో ఆప్షన్ కార్పొరేటర్ మహమూద్ హుస్సేన్‌లు అధికారులను నిలదీశారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పు కారణంగా డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశముందని, తరుచూ ఫాగింగ్ చేసి ఎప్పటికపుడు సమాచారం తనకు సమర్పించాలని స్థానిక అసిస్టెంటు ఎంటమాలజీ అధికారికి సూచించినా, ఆయన పట్టించుకోలేదు. ఆయన నిర్లక్ష్యం కారణంగా గురువారం పనె్నండేళ్ల బాలుడు మృతి చెందాడని కార్పొరేటర్ అయేషా రుబీనా మేయర్ ఆఫీసు వద్ధ అధికారులను నిలదీశారు. అంతలో అక్కడకు వచ్చిన కో ఆప్షన్ కార్పొరేటర్ మహమూద్ హుస్సేన్ సైతం జోక్యం చేసుకుని దోమల నివారణ పేరిట మీరు ఏం చేస్తున్నారో? మాకన్నీ తెలుసు..రోగాలు వచ్చి జనం చస్తుంటే మీరు అబద్దాలు చెబుతారా? అంటూ ఇద్దరు కార్పొరేటర్లు మూకుమ్మడిగా నిలదీయటంతో సమాధానం ఏం చెప్పాలో తెలీక అధికారులు తడబడ్డారు.
జిహెచ్‌ఎంసిలో చేపట్టే పలు అభివృద్ధి పనులు, లెక్కపత్రాలు, పరిపాలనపరమైన అంశాలకు సంబంధించి గురువారం సమావేశమైన స్థారుూ సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అభివృద్ధి అంశాలను పరిశీలించి ఆమోదించిన స్థారుూ సంఘం సమావేశం గురువారం దోమల నివారణ, వ్యాధులు ప్రబలటంపై వాడీవేడిగా సాగింది. ఇందులో ముఖ్యంగా ఇఆర్‌పితో పాటు ఇతర పద్దులను నిర్వహించే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేవలను పాలక మండలి ఆదేశాల మేరకు గత మార్చి 31 నుంచి నిలిపివేసింది. దీంతో జిహెచ్‌ఎంసి అకౌంట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు కొత్త ఎజెన్సీలను టెండర్ల ప్రక్రియతో నియమించే వరకు ఈ పద్దులను బ్లూమ్ సొల్యూషన్స్ ప్రై.లిమిటెడ్ అనే సంస్థకు మూడు నెలల నిర్వాహణ ఛార్జీలను చెల్లించాలని స్థారుూ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీంతో పాటు జంక్షన్ల అభివృద్ది, రహదారుల్లో ఫ్రీ లెఫ్ట్ విధానం ద్వారా మెరుగైన రవాణా వ్యవస్థకు అడ్డంకిగా మారిన బస్ బేల తొలగింపు, భూ సేకరణ, భూ బదలాయింపు ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది. దీంతో పాటు 55 ప్రాంతాల్లో ఫుటోవర్ బ్రిడ్జి నిర్మాణాలను పిపిపి ప్రాతిపదికన నిర్మించేందుకు టెండర్లను పిలించేందుకు ఆమోదం తెలిపింది. నగరంలోని క్రీడామైదానాలు, స్విమ్మింగ్ పూల్‌ల నిర్వాహణలో మార్పులు తెస్తూ, చేసిన ప్రతిపాదనలను వచ్చే స్థారుూ సంఘం సమావేశానికి వాయిదా వేసింది. దీంతో పాటు మోడల్ మార్కెట్ల నిర్వాహణ నిమిత్తం రూపకల్పన చేసిన విధి విధానాలపై వచ్చే స్థారుూ సంఘం సమావేశంలో సుదర్ఘీంగా చర్చించాలని నిర్ణయించి గురువారం స్థారుూ సంఘం తిరస్కరించింది.