హైదరాబాద్

దొంగ అరెస్ : భారీగా బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, సెప్టెంబర్ 8: ఓయు పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని 11.5 తులాల బంగారు గాజులను రికవరీ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఓయు ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి వివరించారు. హబ్సిగూడ గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ ఉద్యోగి డాక్టర్.పిల్‌కెఎం.రావు ఇంట్లో నుంచి 11.5 తులాల బంగారు గాజులు మాయం కావడంతో వారు ఓయు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఓయు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తూ హబ్సిగూడలోనే నివాసం ఉండే మెగావత్ బాలునాయక్ (28) దొంగతనానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. అతని నుంచి దొంగలించిన సొత్తును రికవరీ చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. కేసును ఓయు ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు పంపిణీ
శంషాబాద్, సెప్టెంబర్ 8: ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్న కంప్యూటర్లను ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని శంషాబాద్ ఎంపిపి చెక్కల ఎల్లయ్య అన్నారు. గురువారం ఎంపిడిఓ కార్యాలయంలో ఐదు గ్రామ ప్రంచాయతీలకు కంప్యూటర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి సురేష్ గౌడ్, ఎంపిడిఓ శ్రీకాంత్‌రెడ్డి, సూపరిండెంట్ శేషగిరి శర్మ పాల్గొన్నారు.