హైదరాబాద్

14, 15న అంతర్జాతీయ పతంగుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణలో పతంగుల పండుగను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం వెల్లడించారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని ఆగాఖాన్ అకాడమీలో ఈ నెల 14, 15 తేదీల్లో దీనిని నిర్వహించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో ఎప్పటి నుంచో ఉన్న పతంగుల పండగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ఆగాఖాన్ అకాడమీ సహకారంతో ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ పండుగలో 32 మంది అంతర్జాతీయ స్థాయి కైట్ ఫ్లైయర్స్, 10 టీములు, ఆరు దేశాల నుండి ప్రతినిధులతో పాటు 299 మంది కైట్ ఫ్లైయర్స్ పాల్గొంటారన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బాలికల విద్యను ప్రోత్సహించి, వారికి సాధికారత కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో జరిగే ఈ పతంగుల పండుగలో దాదాపు పదివేల మంది పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్, తెలంగాణ కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, రంగోలి, ఆర్ట్ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. దాదాపు 250 మంది పతంగులను ఒకేసారి ఎగురవేసి ఆకాశాన్ని రంగుల మయం చేస్తారని, ఎంతో అద్భుతమైన ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన అన్నారు. అంగుళం నుంచి 12 అడుగుల పొడవైన వివిధ రకాల పతంగులు కనువిందు చేయనున్న ఈ పండుగలో తెలంగాణ పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెంకటేశం తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో సమావేశంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి శ్రీమతి క్రిస్టినా చాంగ్తు, టూరిజం కమిషనర్ శ్రీమతి సునీత భగవత్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎం.హరికృష్ణ, ఆగాఖాన్ ఫౌండేషన్ తరఫున ఫిషర్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కుమారి నైనా జైస్వాల్, ఆర్కిటెక్చర్ డిజైన్ పౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.