హైదరాబాద్

గ్రేటర్‌లో మొత్తం ఓటర్లు 82.65 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: గ్రేటర్ హైదరాబాద్ ఓటరు జాబితాలో స్వచ్ఛమైన ఓటర్లు ఎంత మంది అన్న విషయాన్ని తేల్చారు అధికారులు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు ఓటర్ల తొలగింపుపై తీవ్ర స్థాయిలో వివాదాలు చెలరేగిన నేపథ్యంలో పంచాయతీ దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. చివరి సారిగా గత జనవరి మాసంలో ఓటరు జాబితా సవరణను చేపట్టిన అధికారులు అప్పట్లో కూడా లక్షల్లో ఓటర్లను తొలగించటం తీవ్ర స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది. కానీ ఇపుడు తాజాగా అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 82లక్షల 65 వేల 4గా లెక్కలు తేల్చారు. వీరిలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే సర్వీస్ ఓటర్లు 2730. అత్యధికంగా కుత్బుల్లాపూర్ 6లక్షల 43వేల 460 మంది ఓటర్లుండగా, శేరిలింగంపల్లి 5లక్షల 96వేల 274 మంది ఓటర్లతో ద్వితీయ స్థానంలో ఉంది. అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 2లక్షల 410 మంది ఓటర్లున్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. కోర్ ఏరియాతో పోల్చితే శివార్లలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఓటర్లున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో3లక్షల 29వేల 912 మంది ఓటర్లున్నారు. ఇదిలా ఉండగా, కొత్త ఓటర్ల పేర్లు చేర్చటం, ఉన్న సమాచారంలోని తప్పులను సరి చేసుకునేందుకు అధికారులు నిరంతర ప్రక్రియ నిర్వహిస్తున్నందున తాజాగా తేల్చిన లెక్క కూడా ఎంతవ వరకు పారదర్శకమో తెలియని అయోమయం నెలకొంది.
10 లక్షల పైచిలుకు ఓట్ల తొలగింపు
జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు బోగస్ ఓట్ల ఏరివేత కోసం మహానగర పాలక సంస్థ చేపట్టిన ప్రక్రియ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే! అధికార పార్టీ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకే స్థానికేతరుల ఓట్లు తొలగిస్తుందంటూ వివిధ పార్టీలు ఆరోపించటంతో వ్యవహారం కాస్త దిదీల్లికి చేరింది. దీంతో అధికారులు మొదటి దశలో 6లక్షల 30వేల 652 ఓట్లు తొలగించారు. అంతేగాక, 19లక్షల 71వేల 897 మందికి నోటీసులిచ్చారు. దీంతో రాజకీయపార్టీల్లో తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక క్రమంలో అధికారుల నిలదీతకు సైతం దారి తీసింది. కేంద్ర ఎన్నికల సంఘం రంగంలో దిగటంతో జిహెచ్‌ఎంసి అధికారులు నోటీసులిచ్చిన 19.71లక్షల మందిలో కేవలం 4లక్షల 30వేల 702 ఓట్లు తొలగించారు. చనిపోయిన వారు, ఒకటికి మంచి వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు కల్గిన వ్యక్తుల వివరాల తొలగింపు వంటి ప్రక్రియలతో అధికారులు మొత్తం 10లక్షల 61వేల 354 ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు ప్రక్రియకు ముందు 83లక్షల 265 మంది ఓట్లుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 82వేల 65వేల 4కు తగ్గింది. కూకట్‌పల్లిలో 39వేల 520, శేరిలింగంపల్లిలో 25వేల 180 మంది పేర్లను తొలగించగా, కార్వన్‌లో 23వేల 685, ముషీరాబాద్‌లో 20వేలు, రాజేంద్రనగర్‌లో 4047, మహేశ్వరంలో 4049 మంది వివరాలను బోగస్ ఓటర్లుగా గుర్తించి తొలగించారు.