ఆంధ్రప్రదేశ్‌

సిఎం పదవికి రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రాకు ప్రత్యేక హోదా తేవడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షనేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన కెసిఆర్ పోరాటం ద్వారా లక్ష్యాన్ని సాధించారన్నారు. పార్లమెంటు వేదికగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని, చట్టంలోని అంశాల సాధనకు కెసిఆర్ తరహాలోనే పోరాటం చేసి హోదా సాధిస్తామని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్యాకేజీలో ఏమీ లేదని, రాష్ట్రానికి భిక్ష వేసినట్లుగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. 10వ తేదీ శనివారం ఇచ్చిన బంద్ పిలుపునకు అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇచ్చి జయప్రదం చేయాలని కోరారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, జైట్లీ అర్ధరాత్రి ప్రకటన చేయాల్సిన అవసరం ఏముందని, అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు స్పందించడమేంటన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు స్వాగతించడం ఎందుకన్నారు. ఓటుకు నోటు కేసులో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. ఐదు కోట్లమంది ఆంధ్రుల భవిష్యత్తు నాశనమవుతుంటే, అసెంబ్లీలో చర్చ జరగకుండా చంద్రబాబు ఎత్తుగడలకు పాల్పడుతున్నారన్నారు. హోదాపై నిలదీస్తే అసెంబ్లీలో టిడిపి, స్పీకర్ కలిసిపోయి మార్షల్స్‌ను రంగంలోకి దింపి ప్రతిపక్ష పార్టీ గొంతును నొక్కేందుకు ప్రయత్నించడం ఎందుకన్నారు. చంద్రబాబు హయాంలో గతంలో స్పీకర్ ఆలపాటి ధర్మారావుకు అవమానం జరిగిందనీ, దళిత మహిళ కుతూహలమ్మ డిప్యూటీ స్పీకర్‌గా ఉండగా, ఆమెచేత కంటతడి పెట్టించారని జగన్ ధ్వజమెత్తారు. 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఆంధ్రాకు ఇవ్వద్దని సిఫార్సుచేయలేదన్నారు. హోదా వస్తే కొత్తగా వచ్చే వస్తుసేవా పన్నులో కూడా ఎక్కువ లాభం హోదా ఉన్న రాష్ట్రాలకు వస్తుందన్నారు. కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్ధలను ఏర్పాటు చేయాలన్న విధానానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఈ సంస్ధలను ఏర్పాటు చేస్తున్నారని, ప్యాకేజీలో భాగంగా ఈ అంశాలను ప్రస్తావించడం దారుణమన్నారు.

చిత్రం... శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వైకాపా అధినేత జగన్