హైదరాబాద్

కథ అడ్డం తిరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: కాస్త సామాజిక ధృక్పతం ఉన్న వారేవరైనా కళ్ల ముందు ఎవరైనా నలుగురికి ఉపయోగపడే పని చేస్తుంటే అభినందించక ఉండలేరు. ఇలాంటి ప్రయత్నమే చేసిన మన గ్రేటర్ కమిషనర్ ఒకింత ఖంగుతిన్న సంఘటన శనివారం నగరంలో చోటుచేసుకుంది. ఈ నెల 15వ తేదీన జరగనున్న సామూహిక వినాయక నిమజ్జనంలో భాగంగా బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు శోభయాత్ర జరగనున్న ప్రాంతాలను కమిషనర్ జనార్దన్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆయన ఎం.జె.మార్కెట్ సిగ్నల్ వద్ధ ఓ యువకుడు రెడ్ సిగ్నల్ పడినపుడు వాహనదారులు తమ వాహనాలను ఆఫ్ చేసుకుని, ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్ల బోర్డు పట్టుకుని కన్పించాడు. ఎంతో ఆసక్తిగా కన్పించటంతో కమిషనర్ ఆ యువకుడ్ని తన వాహనంలోకి పిలుపించుకుని, ఈ విధంగా నగరవాసుల్లో వాహన ఇంధనం ఆదాపై అవగాహన కల్పించేందుకు చొరవ తీసుకున్నావని, ప్రజల్లో చైతన్యం కల్గిస్తున్న ఆ యువకుడి వివరాలు అడిగి తెల్సుకున్నారు. సదరు యువకుడు తన పేరుతో పాటు తాను డ్రైవర్‌గా పనిచేస్తుంటానని తెలిపారు. రోజూ ఇలాగే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తావా? అన్న కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రశ్నకు స్పందించిన ఆ యువకుడు ఆ ఏమీలేదు సార్..నేను ‘డ్రంక అండ్ డ్రైవ్’లో పోలీసులకు పట్టుబడ్డానని, అందుకు పనిష్మెంటుగా ఎం.జె.మార్కెట్‌లో ఈ రకంగా ప్లకార్డు పట్టుకుని నిలబడాలని శిక్ష వేసినందుకు ఇలా నిల్చున్నానని చెప్పటంతో కమిషనర్ ఒకింత ఖంగుతిన్నారు. సమాజానికి ఓ మంచిపని చేస్తున్నాడని అభినందిద్దామనుకున్న తనకు ఈ రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తగిలాడేంటీ అంటూ వాపోయారు.