హైదరాబాద్

సుశృతది ఆత్మహత్య కాదు..హత్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సైదాబాద్, సెప్టెంబర్ 12: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసల బస్తీకి చెందిన గృహిణి సుశ్రుతది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సుశ్రుతను ఆమె భర్త మోహన్‌రావు, అత్త,మామలు కలసి హత్య చేశారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతోపాటు అత్త,మామలను అదుపులోకి తీసుకున్నారు. సుశ్రుత మృతదేహాన్ని చూసేందుకు ఆమె బంధువులు పెద్దఎత్తున ఉస్మానియా ఆసుపత్రికి తరలివచ్చారు. ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భర్త మోహన్‌రావు, అత్తమామలను తమకు అప్పగించాలని ఉస్మానియా ఆసుపత్రి మూర్చురీ వద్ద బైఠాయించారు. దీంతో ఆసుపత్రి వద్ద కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను సర్దిచెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా సుశ్రుత చేసిన పాపం వేడి నీళ్లకోసం వాటర్ హీటర్‌ను ఎక్కువ సేపు వాడడమే. అంత మాత్రానికే ఆమె భర్త విచక్షణ రహితంగా కొట్టాడు. తప్పయింది..క్షమించు అంటున్నా బాత్ రూం నుంచి వివస్తగ్రా ఆమెను కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చాడు. అత్తమామలు, తోటి కోడలు, ఇతర కుటుంబ సభ్యులు చూస్తుండగా ఒంటి మీద బట్టలు లేకుండా కొట్టాడు. దీంతో ఆ అవమానాన్ని భరించలేక తీవ్ర మనస్థాపానికి గురై తల్లిదండ్రులకు వాట్సాప్‌లో మెస్సేజ్ పెట్టి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.