హైదరాబాద్

అపోలో మెడ్ స్కిల్స్ శిక్షణ తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యావంతులైన యువతీ యువకులకు వైద్యరంగంలో వివిధ రకాల కోర్సుల్లో ఉచిత శిక్షాణ కార్యక్రమాలను అందించి, తద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడానికి అపోలో యాజమాన్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంయ క్తంగా అపోలో మెడ్ స్కిల్స్‌కు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అపోలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను అపోలో జెడిఎం మహిత తెలిపారు. ఈ శిక్షణా కాలం మూడునెలలు వ్యవధితో పాటు ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయన్నారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్, హోమ్ హెల్త్ ఎయడ్ శిక్షణతో పాటు వైద్య రంగంలో వివిధ రకాల శిక్షణలో యువతకు మెలకువలతో పాటు అవగాహన కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గ్రామీణ య వతకు భరోసా కల్పించడానికి అమలు చేస్తున్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులను భరిస్తాయ. హెల్త్ కేర్ రంగంలో వివిధ శిక్షణలు ఇవ్వడం ద్వారా యువత భవిష్యత్‌ను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు డిగ్రీ పూర్తి చేసుకున్న నిరు ద్యోగులకు అవకాశాలు ఉన్నాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న య వతకు కేంద్రం ప్రభుత్వంచే సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీంతో ప్రభ్వుత్వ రంగంలో ఉన్న వైద్య ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలను అపోలో యాజమాన్యం చేయ తను అందిస్తుందని ఆమె తెలిపారు.