బిజినెస్

పరిశ్రమలకు ఊతమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, పరిశ్రమల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపి కవిత తెలిపారు. ఎఫ్‌ట్యాప్సీ భవన్‌లో మంగళవారం తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ (టిఐఎఫ్), తెలంగాణ జాగృతి స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పారిశ్రామికవేత్తలు సైతం పాల్గొన్నారని గుర్తుచేశారు. కాగా, టిఐఎఫ్ మేకిన్ తెలంగాణ పేరుతో రూపొందించిన మాసపత్రికను కవిత ఈ సందర్భంగా విడుదల చేశారు. ఆజంజాహి మిల్స్, ప్రాగాటూల్స్, హెచ్‌ఎంటి వంటి సంస్థలు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో రెండు, మూడు తరాల పారిశ్రామికవేత్తలు అణచివేతకు గురయ్యారని, ఫలితంగా ఉపాధి కరువైందన్నారు. కాగా, బాలానగర్‌లోని చిన్న పరిశ్రమలు నగరంలో కలిసిపోయాయని, వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఎఫ్‌ట్యాప్సీ భవన్‌లో మాట్లాడుతున్న కవిత