హైదరాబాద్

తాండూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో రక్త‘నిధి’ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తాండూర్‌లోని రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తున్నామని అన్నారు. తాండూరులో రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షనిధి కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో రక్తం అవసరమున్న ప్రసూతీ మహిళలు, ప్రమాదాల బాధితులు, పేద ప్రజానీకం కోసం రక్తనిధిని ఏర్పాటు వేగవంతం చేశామని తెలిపారు. ఇందులో భాగంగా గత రెండు దశాబ్దాలుగా నిధుల కోసం ఎదురు చూస్తున్న తాండూర్ జిల్లా ఆసుపత్రి రక్తనిధికి జివో నెంబర్ 571 ద్వారా తెలంగాణ ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో రూ.31.60 లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. ఇందులో సిబ్బంది జీతభత్యాలకోసం రూ.16.26 లక్షలు మంజూరు చేసిందని అన్నారు. రక్తనిధిలో డాక్టర్‌తోపాటు ఇద్దరు స్ట్ఫా నర్సులు, ఐదుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక సామాజిక కార్యకర్తతోపాటు అటెండర్ ఉంటారని వీరికి ప్రభుత్వం ఏడాదిలోని 12 నెలల జీతాలకు సదరు నిధులు విడుదల చేసిందని తెలిపారు. వీటికి ఒక్కోక్కటి రూ.400తో ఏడాదికి సరిపడే విధంగా 3600కు రూ.14.40 లక్షల నిధులను మంజూరు చేసి విడుదల చేసిందని వెల్లడించారు. రక్తనిధి నిర్వహణ కోసం యేటా లక్ష నిధులను కేటాయించామని తెలిపారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో రక్తనిధికి రెడ్‌క్రాస్ సంస్థ పర్యవేక్షణలో త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. అత్యవసరంగా రక్తం అవసరమైతే ప్రస్తుతం 120 కి.మీ. దూరంలోని హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని ఫలితంగా నిండు ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొంటుందని అన్నారు. ఇది పలుసార్లు బాధాకరంగా నిలుస్తున్నందున రక్తనిధి త్వరగా ఏర్పాటుచేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఫలితంగా తాండూర్‌తోపాటు కోడంగల్, వికారాబాద్ నియోజకవర్గాలతో పాటు పొరుగు కర్ణాటక రాష్ట్ర చించోలీ, సేడం తదితర నియోజకవర్గాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు.
రానున్న రోజుల్లో జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు రెస్ట్‌రూమ్ (విశ్రాంతి గది), రెండు అంబులెన్సులతోపాటు నిర్వహణ తదితరాల మీద దృష్టి సారిస్తామని మంత్రి వెల్లడించారు. బధిరులు, వికలాంగులు తదితరుల పునరావాస కేంద్రం కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని త్వరలో మంజూరు వచ్చే అవకాశాలున్నాయని మంత్రి వివరించారు.