హైదరాబాద్

మీ చిన్నారులకు చుక్కల మందు వేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: అయిదేళ్లలోపున్న చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఈ నెల 17వ తేదీన గ్రేటర్‌లో పంపిణీ చేయనున్న చుక్కల మందును తల్లిదండ్రులు విధిగా వేయించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు ప్రచురించిన పోస్టర్‌ను ఆయన బుధవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈసారి సుమారు 6లక్షల 8వేల మంది అయిదేళ్లలోపు చిన్నారులకు పోలియో మందు అందించాలన్న లక్ష్యంతో మొత్తం 3032 పోలియో బూత్‌లలో క్షేత్ర స్థాయి విధుల కోసం దాదాపు 12800 మంది సిబ్బందిని నియమించనున్నట్లు అధికారులు ఆయన తెలిపారు. కార్యక్రమం విజయవంతమయ్యేందుకు వీలుగా ఇప్పటికే పలు సార్లు జిహెచ్‌ఎంసి, రెవెన్యూ అధికారులు సమష్టిగా సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. 17న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోలియో మందును పంపిణీ చేయనున్నట్లు వివరించారు. వీటితో పాటు హైదరాబాద్ నగరంలో 85 సంచార బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నగరంలోని రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, పబ్లిక్ పార్కులు, మ్యారేజ్ హాల్స్ తదితర ప్రాంతాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, కళాశాల విద్యార్థులు, ఎన్‌సిసి, నర్సింగ్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, తదితర ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు.
ఈ నెల 18 నుంచి 20 తేదీల్లో పల్స్‌పోలియో చుక్కలను వేసుకోని పిల్లలను గుర్తించి, వారికి కూడా మందును పంపిణీ చేసేందుకు ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రవికిరణ్, భాస్కరాచారి, డిఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు తదితరులున్నారు.

మీరే వారికి హెల్పర్లు

హైదరాబాద్, జనవరి 13: నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా మహానగర పాలక సంస్థ ఆటో టిప్పర్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే లైసెన్సుల్లేని పారిశుద్ధ్య కార్మికులు గత కొద్దిరోజులుగా తాము ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కమిషనర్ జనార్దన్‌రెడ్డి బుధవారం వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ముఖ్యంగా ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టక ముందు రిక్షాల ద్వారా ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్న వారిలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారికి ఈ ఆటోలను సమకూర్చామని, లైసెన్సు లేని వారిని ఆటో కార్మికులకు హెల్పర్లుగా నియమించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నగరంలో మొత్తం 20లక్షల నివాసాలున్నాయని, ప్రస్తుతం ఈ ఆటో టిప్పర్ల ద్వారా కేవలం పది లక్షల ఇళ్ల నుంచి మాత్రమే చెత్త సేకరించటం జరుగుతోందని వివరించారు. మిగిలిన పది లక్షల గృహాల నుంచి చెత్త సేకరణకు ప్రస్తుతం రిక్షా కార్మికులను నియమిస్తామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సు ఉన్న రిక్షా కార్మికులకు ఆటో టిప్పర్లు అందించే సమయంలో ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. డ్రైవింగ్ లైసెన్సుల్లేని రిక్షా కార్మికులను ఆటో టిప్పర్లు వెళ్లలేని ప్రాంతాలకు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇందుకు గాను జిహెచ్‌ఎంసి అర్బన్ కమ్యూనిటీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం ద్వారా రిక్షాల ద్వారా పారిశుద్ధ్య కార్మికులను గుర్తించటం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే ఆటో టిప్పర్లు అందించిన వారికి వెంటనే చెత్త సేకరణకు ప్రాంతాలకు కేటాయించాలని కమిషనర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కార్మికుడి ఉపాధి అవకాశాలను దెబ్బతీయమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ రవికిరణ్, భాస్కరాచారి పాల్గొన్నారు.