హైదరాబాద్

రెండోరోజూ కొనసాగిన నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: వినాయక నిమజ్జన ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. రాష్ట్రంలోనే గొప్పగా చెప్పుకునే ఖైరతాబాద్ వినాయకుడ్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మధ్యాహ్నం రెండుగంటల్లోపు నిమజ్జనం చేయించటంలో సఫలీకృతులైన పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారులు అర్థరాత్రి వరకు నిమజ్జనాన్ని ముగించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఒక రకంగా గత నిమజ్జనోత్సవంతో పోల్చితే కొంత వరకు జనం సంఖ్య తగ్గినా, నిమజ్జన ప్రక్రియ మాత్రం గత సంవత్సరం మాదిరిగానే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఇందుకు నిమజ్జనం రోజు ఉదయం కూడా భారీ వర్షం కురిసి, మధ్యాహ్నం తెరపిన్వటం ఒక కారణమైతే, భారీ విగ్రహాలన్నీ కూడా సాయంత్రం నిమజ్జనానికి తరలిరావటం మరో కారణంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు సాగర్‌లో 3,5,7,9,11 రోజుల్లో కలిపి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌తో పాటు గ్రేటర్ తొమ్మిది చెరువుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొలనుల్లో నిమజ్జన విగ్రహాలతో కలిపి మొత్తం లక్ష విగ్రహాల వరకు నిమజ్జనమైనట్లు, ఇందులో ఎకో ఫ్రెండ్లీ వినాయకులు పది శాతం వరకున్నట్లు కొన్ని ప్రైవేటు సంస్థలు అంచనాలు వెల్లడిస్తుండగా, జిహెచ్‌ఎంసి అధికారుల లెక్క ప్రకారం 59వేల 56వేల 910 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు. నిమజ్జన ప్రక్రియకు సంబంధించి ఈ సారి ప్రభుత్వం ప్రత్యేక కొలనులను ఏర్పాటు చేయటం, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలపై విస్త్రృతంగా ప్రచారం చేయటం వంటివి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే!
కొనసాగుతున్న వ్యర్థాల తొలగింపు
హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యం నుంచి రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా నిమజ్జన వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. విగ్రహాన్ని నిమజ్జనం చేసిన మూడు, నాలుగు గంటల తర్వాత వ్యర్థాలను తొలగించే ప్రక్రియను చేపట్టినా, ఆ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 6305 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం 5051 మెట్రిక్ టన్నులు, శుక్రవారం మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు 2183 మెట్రిక్ టన్నులను కలిపి సాయంత్రానికల్లా 6305 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించామని, మొత్తం నిమజ్జన వ్యర్థాలు 7132 మెట్రిక్ టన్నుల వరకు ఉండవచ్చునని జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు.
వ్యర్థాల తొలగింపును పరిశీలించిన కమిషనర్
వినాయక నిమజ్జనంలో వచ్చిన వ్యర్థాలను హుస్సేన్‌సాగర్ చెరువు, పరిసర ప్రాంతాల నుంచి తొలగించే పనులను జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అంతేగాక, పరిసర ప్రాంతాల్లోని పలు రహదారుల్లో జరుగుతున్న పారిశుద్ద్య పనులను సైతం ఆయన తనిఖీ చేశరా. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగంలోని పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని సైతం ఆయన పరిశీలించారు. నగరానికి ప్రత్యేక ఆకర్షణగా భారీ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే లుంబినీపార్కు లాంటి పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టూరిజం కార్పొరేషన్ జనరల్ మేనేజర్ మనోహర్, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ రవికిరణ్‌లు కూడా కమిషనర్‌తో పాటు ఉన్నారు. హైదరాబాద్ నగరంలోవ ప్రధాన పర్యాటక ప్రాంతమైన లుంబినీపార్కులో గత రెండు రోజులుగా జరుగుతున్న వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పడ్డ చెత్తాచెదారం, వ్యర్థాల తొలగింపు, హుస్సేన్‌సాగర్‌లోని వ్యర్థాలను తొలగించే ప్రక్రియను ఆయన బోటులో షికారు చేస్తూ పరిశీలించారు. గత సంవత్సరం వినాయక నిమజ్జనం అనంతరం సాగర్ నుంచి 4వేల మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించటం జరిగిందని, ఈ సంవత్సరం కూడా అంతే పరిమాణంలో వ్యర్థాలను తొలగించటంలో హెచ్‌ఎండిఏ ప్రణాళికలను సిద్దం చేసిందన్నారు. పర్యటనలో భాగంగా ఆయన లుంబినీపార్కు, నెక్లెస్‌రోడ్డ, ట్యాంక్‌బండ్‌పై ఉన్న వ్యాపారులతో మాట్లాడారు. ఈ చిరువ్యాపారులలో రాజస్థాన్, ఒడిశ్శా, లక్నోల నుంచి ప్రత్యేకంగా నిమజ్జన కార్యక్రమం సందర్భంగా బొమ్మలు తదితర వస్తువులు విక్రయించేందుకు వచ్చిన వారి వివరాలను కమిషనర్ ఎంతో ఆసక్తితో అడిగి తెల్సుకున్నారు. నిమజ్జనం సందర్భంగా రోజుకి కనీసం రూ. 10వేల పై చిలుకు ఆదాయం వస్తుందని, ప్రతి సంవత్సరం హైదరాబాద్‌కు వస్తామని వ్యాపారులు కమిషనర్‌కు తెలిపారు.
అనంతరం ట్యాంక్‌బండ్‌పై పారిశుద్ద్య కార్యక్రమాలను కమిషనర్ పరిశీలించారు.