హైదరాబాద్

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి కర్తవ్యం: రవీంద్రగుప్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, సెప్టెంబర్ 18: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాల్సిన అవసరం ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త పేర్కొన్నారు. ఆదివారం రైల్వేలో ఈనెల 17- 25వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో పలు కార్యక్రమాల్లో పాలుపంచుకొని స్టేషన్‌ను పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. రైల్వే ఉద్యోగులు స్వచ్ఛతాపై కార్యక్రమాన్ని నిర్వహించి పరిశుభ్రతను పాటించాల్సిన ఆవశ్యకతను, కర్తవ్యాన్ని గురించి వివరించారు. అనంతరం స్టేషన్ ఫ్లాట్‌పారమ్‌ల క్లీనింగ్ కార్యక్రమంలో జిఎం పాలుపంచుకున్నారు. వెయిటింగ్ రూమ్‌లను, బుకింగ్ కౌంటర్‌లతోపాటు అన్ని ప్రాంతాల్లో కలియ తిరుగుతూ స్టేషన్‌లో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోనే ఉన్న ఐఆర్‌సిటిసి క్యాంటీన్‌ను సందర్శించి తినుబండారాలను పరిశీలించారు. బుకింగ్ కౌంటర్‌ల వద్ద వేచి ఉన్న ప్రయాణికులకు ఆటో వెండింగ్ మిషన్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ఒక్కరోజుతో అయిపోయేది కాదని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తమవంతు కర్తవ్యంగా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇది కేవలం ఏ ఒక్కరికో పరిమితం కాదని, ఈ కార్యక్రమం పట్ల స్వచ్చంద సంస్థలు,సామాజిక కార్యకర్తలు రైల్వే ప్రయాణికులు అందరు కలిసికట్టుగా నడుంబిగిస్తే విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజనల్ రైల్వే మేనేజర్ అశీష్ అగర్వాల్‌తోపాటు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌లో...
మల్కాజిగిరి: మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌లో రైల్వే డివిజినల్ ఫైనాన్స్ మేనేజర్ దివాకర్, సబర్బన్ బస్సు అండ్ ట్రైన్ టావెలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూర్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వేస్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫారంలపై నెలకొన్న చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూర్ మాట్లాడుతూ మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
శివారు ప్రాంతాలకు మల్కాజిగిరి రైల్వేస్టేషన్ ఎంతో సౌకర్యంగా ఉందని ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని నూర్ కోరారు. కార్యక్రమంలో అధికారులతో పాటు అసోసియేషన్ నిర్వాహకులు మాధవరావు, చంద్రశేఖర్, సుధ, పార్వతి, ఆర్.శ్రీనివాస్, కోటేశ్వర్ పాల్గొన్నారు.
లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో...
శేరిలింగంపల్లి: స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రైల్ కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఎజిఎం అనిల్‌కుమార్ గుప్త ఆదివారం లింగంపల్లి రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఎజిఎంతో కలిసి పరిసరాలను పరిశీలించారు. నల్లగండ్ల నుంచి వచ్చేదారిలో రైల్వేలైన్‌ను ఆనుకుని ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్ ఎజిఎంను కోరారు. రైల్వేస్టేషన్‌లో, ఎంఎంటిఎస్ రైళ్లలో చెత్తాచెదారం లేకుండా చూడాలని, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక రైల్వే అధికారులకు ఏజిఎం సూచించారు. స్టేషన్‌లో ఉన్న సౌకర్యాలు, సమస్యలపై ఏజిఎం ప్రయాణికులను అడిగి తెలుసు కున్నారు. ఏజిఎం వెంట ఎడిఆర్‌ఎం టాంట, ఎస్‌డిఇఎం ప్రసాదరావు, స్టేషన్ మాస్టర్ జార్జ్ థామస్ ఉన్నారు.