హైదరాబాద్

అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: నగరంలో ఎవరి భూమిలో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపట్టేందుకు జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు అండగా నిలుస్తున్నారని, అక్రమార్కులకు కోర్టు నుంచి స్టే తెచ్చుకోమని కూడా పురమాయిస్తున్నారని కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంలో మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. బంజారాహిల్స్ ప్రాంతంలో రోజుకో చోట ఒక్కో అంతస్తు అక్రమంగా నిర్మిస్తున్నా, అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. స్వయంగా తాను ఫిర్యాదు చేసినా, అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేదని, ఓ పేద కుటుంబం రేకుల ఇళ్లకు మరమ్మతులు చేసుకుంటే ఇదే ఏసిపిలు అనుమతులున్నాయా? లే అవుట్ ఆమోదం ఉందా? అంటూ సవాలక్ష కారణాలు చూపుతుంటారని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె ప్రశ్నకు మద్దతునిస్తూ కో ఆప్షన్ సభ్యుడు రాజుగుప్తా కూడా అక్రమ నిర్మాణాలపై సభలో మాట్లాడారు. ఇందుకు స్పందించిన మేయర్ బొంతు రామ్మోహన్ అక్రమంగా నిర్మాణాలు చేపట్టే వారికి జిహెచ్‌ఎంసి జారీ చేస్తే, దాన్ని ఆధారంగా చేసుకుని వారు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారని, ఇలా కాకుండా అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలేమేనా ఉన్నాయా? అంటూనే సభ్యురాలి ప్రశ్నకు సమాధానంగా చెప్పాలని కమిషనర్ జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైకోర్టులో 3200 కేసులు, దిగువ కోర్టుల్లో మరో 1929 కేసులున్నాయని వివరించారు.
ఇటీవలే ప్రభుత్వం నియమించిన బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి తెచ్చి, పక్కాగా అమలు చేసి, ఇలాంటి నిర్మాణాలకు చెక్ పెడతామని చెప్పారు. అంతేగాక, ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న విషయంపై నిఘా పెట్టేందుకు తగిన స్థాయిలో సిబ్బంది లేదని ఆయన తెలిపారు. మొత్తం 214 మంది సెక్షన్ ఆఫీసర్ల అవసరముండగా, కేవలం 34 మంది మాత్రమే ఉన్నారని, ఈ విషయాన్ని మంత్రి కెటిఆర్‌కు వివరించగా, త్వరలోనే సిబ్బందిని సమకూర్చుతామని హామీ ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు.
సస్పెండ్ చేయాల్సిందే : ఎమ్మెల్సీ ప్రభాకర్
అక్రమ నిర్మాణాలపై స్పందించిన శాసన మండలి సభ్యుడు ఎం.ఎస్. ప్రభాకర్ ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో ఇటీవల పోర్టికో కూలి అమాయకులు ప్రాణాలు కొల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. తప్పు క్లబ్ యాజమాన్యానిదైతే కార్మికులు ప్రాణాలు కొల్పోయారని, వారి కుటుంబాలకు జిహెచ్‌ఎంసి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుందని, ఇందులో యాజమాన్యాన్ని ఎంతవరకు బాధ్యులను చేశారని ప్రశ్నించారు.
కళ్ల ముందు అక్రమంగా నిర్మాణం జరుగుతున్నా, పట్టించుకోకపోవటం ఏమిటీ? అంటూనే ఒకరిద్దరిని నిర్దాక్షిణంగా సస్పెండ్ చేస్తే తప్ప అధికారులు తీరు మారేలా లేదని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.