హైదరాబాద్

చినుకు పడితే అన్నీ చిక్కులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: మహానగరంలో సోమవారం సాయంత్రం మరో సారి ఓ మోస్తారు వర్షం పడింది. ఇప్పటికే పలు సార్లు కురిసిన భారీ వర్షాల షాక్ నుంచి నగరం తేరుకోకముందే సోమవారం సాయంత్రం సుమారు గంటన్నర సేపు ఓ మోస్తారు వర్షం పడింది. ఫలితంగా నిత్యం రద్ధీగా ఉండే జంక్షన్లలో ట్రాఫిక్ జాం అయింది. అంతేగాక, లోతట్టుప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరటంతో ఎపుడేం జరుగుతుందోననంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం కురిసిన ఆరున్నర గంటల సమయంలో ప్రారంభమైన వర్షం అరగంటలో అంటే ఏడు గంటల్లోపు ఒక సెంటీమీటర్ కురిసినట్లు సమాచారం. అశోక్‌నగర్, నాగమయ్య కుంట, నదీంకాలనీతో పాటు మల్లేపల్లి, కార్వాన్ నియోకవర్గంలోని లంగర్‌హౌజ్ తదితర ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. నిత్యం వాహనాల రాకపోకలతో కిటకిటలాడే ప్రధాన రహదార్లన్నీ చిన్నసైజు చెరువులను తలపించాయి. రద్ధీగా ఉండే పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాణిగంజ్, బైబిల్ హౌజ్ చౌరస్తాలతో పాటు బేగంపేట, మాసాబ్‌ట్యాంక్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌తో పాటు అప్పర్‌ట్యాంక్‌బండ్‌పై దాదాపు రెండు గంటల సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇక లోయర్ ట్యాంక్‌బండ్‌లోని గోశాల, వైస్రాయ్ సర్కిల్ నుంచి బైబిల్ హౌజ్ వచ్చే రోడ్డు, ఆర్టీసి క్రాస్‌రోడ్డు నుంచి ముషీరాబాద్, సికిందరాబాద్ స్టేషన్ నుంచి వైఎంసిఏ వెళ్లే ప్రధాన రహదారుల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులకే గాక, పాదచారులకు కూడా అడుగడుగున ఇబ్బందులు తప్పలేదు. బేగంపేట నుంచి సికిందరాబాద్ స్టేషన్‌కు చేరుకునేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టినట్లు కొందరు వాహనదారులు వాపోయారు. ఇప్పటికే వాటర్ స్టాగినేషన్ పాయింట్లను గుర్తించామని, వర్షం కురిసినపుడు ప్రజలకు, వాహనదారులకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపడుతామని ప్రకటించిన బల్దియా ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా ఎక్కడా కూడా చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. మహావీర్ ఆస్పత్రి బస్టాపు, హోటల్ వుడ్‌లాండ్ ముందున్న రహదారితో పాటు, రాణిగంజ్ చౌరస్తా, బైబిల్‌హౌజ్ రైల్వే బ్రిడ్జి కింద చౌరస్తా, పంజాగుట్ట, ఖైరతాబాద్ చౌరస్తాలు, అలాగే ఎం.జె.మార్కెట్ చౌరస్తాల్లో వర్షపు నీరు నిలిచిపోవటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి దాదాపు రెండు గంటల సేపు వాహనాలు క్యూ కట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అలాగే రాణిగంజ్ చౌరస్తాలో భారీగా వర్షపు నీరు నిల్వటంతో అటు రాణిగంజ్, ఇటు అప్పర్‌ట్యాంక్‌బండ్‌లపై భారీగా ట్రాఫిక్ నిల్చిపోయింది.