హైదరాబాద్

టికెటిస్తే.. ఏ పార్టీ అయనా ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఇప్పటి భుజంపై మోసిన జెండా పార్టీ టికెట్ దక్కితే ఫర్వాలేదు..లేదంటే ఇతర పార్టీలెవరు టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు సై అంటున్నారు ఆశావహులు. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తూ కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి, బిజెపి పార్టీల్లో ఒక్కొదానికి వేల సంఖ్యలో వినతులు అందిన సంగతి తెలిసిందే! వీరిలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు ఆయాపార్టీలకు చెందిన అధినాయకులు ప్రయత్నాల్లో నిమగ్నం కాగా, బయోడేటాలు సమర్పించిన ఆశావహులు వారి ఏర్పాట్లలో వారున్నారు. సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీలతో పొత్తులు, సమీకరణలు వంటి ఏ కారణం చేతనైనా తమకు టికెట్ దక్కకుంటే ఇతర పార్టీల టికెట్లనైనా దక్కించుకునేందుకు ఆశావహులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన అధినాయకులను రహస్యంగా కలిసి డివిజన్‌లో తమకున్న పట్టు, తమ సామాజికవర్గం పరంగా ఉన్న ఓట్ల వివరాలను వివరిస్తున్నారు. పార్టీలు కూడా సొంత పార్టీ నేతల నుంచి టికెట్ల వేల సంఖ్యలో దరఖాస్తులొచ్చినా,వాటిలో గెలిచే సత్తా, సామర్థ్యం ఉన్న వారిని జల్లెడ పడుతున్నారు. కొన్ని డివిజన్లలో నేతల్లో గెలిచే సమర్థత ఉన్నా, ఆర్థికంగా కాస్త బలహీనంగా ఉన్న అభ్యర్థులు సైతం ఉన్నారు. మరికొన్ని డివిజన్లలో డబ్బు పలుకుబడి ఉన్నా, ప్రజల్లో గుర్తింపు లేని ఆశావహులు, కొద్దిరోజుల క్రితమే పార్టీలో చేరిన వారూ సైతం లేకపోలేదు. ఈ రకమైన లోపాలను సరి చేస్తూ పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ టికెట్లు కేటాయించటం అధినాయకులకు కాస్త ఇబ్బందిగానే మారినా, గెలిచే అభ్యర్థులనే ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక అధికార టిఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఇతర పార్టీలకు చెందిన, డివిజన్‌లో మంచి ఆదరణ, గెలిచే శక్తి సామర్థ్యం ఉన్న ఆశావహులు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైతే చివరి నిమిషంలో బి ఫారాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈసారి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య అవగాహన ఒప్పందం లేదన్న విషయం దాదాపు తేలిపోయిన నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ డివిజన్ నుంచి ఓ మంత్రి సోదరుడు బిజెపిలోనే కొనసాగుతూ, మజ్లిస్ టికెట్ కోసం దారుస్సలం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. మరికొన్ని డివిజన్లలో బిజెపి, టిడిపి,కాంగ్రెస్ పార్టీకి చెంది, ఇప్పటికే పలు సార్లు కార్పొరేటర్లుగా గెలిచిన వారు, కొత్తగా పోటీ చేసినా గెలిచే సత్తా కల్గిన నేతల్లో కొందరు టిఆర్‌ఎస్ టికెట్ అయితే బాగుండేదన్న భావనలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలో ఆశావాహుల ప్రత్యామ్నాయ ప్రయత్నాలతో నామినేషన్ల గడువుముగిసే సమయానికి టిఆర్‌ఎస్‌లోకి టికెట్ల కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి.

షేత్ వారి వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలి: రేమాండ్ పీటర్

హైదరాబాద్, జనవరి 13: ప్రతి మండలంలో షేత్‌వారి వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రేమాండ్ పీటర్ అన్నారు. సచివాలయం నుండి రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ భూమి రికార్డుల ప్రాజెక్టుల కింద భూ వివరాలు అన్ని వెబ్‌సైట్‌లో పొందపర్చవలసి ఉందని, ఈ విషయంలో తహశీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అదే విధంగా సర్వే ఆఫ్ ఇండియా దాదాపు 143 జిటి స్టేషన్లు ఏర్పాటు చేసిందని వీటి నిర్వహణ సంబంధిత జిల్లా గదుల్లో ఉండాలని అలాంటి లేని చోట వారికి సంబంధించి ప్రతిపాదనలు సిసిఎల్‌ఎకు పంపాలని అన్నారు. ప్రతి మండలంలోని తహశీల్దార్లు, విఆర్‌ఒలు తప్పని సరిగా స్థానికంగా ఉండాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి, డిఆర్‌ఒ ధర్మారెడ్డి, ఆర్డిఒ సురేష్‌పొద్దార్ పాల్గొన్నారు.

ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్
కాచిగూడ, జనవరి 13: దివంగత ఎన్‌టి రామరావు ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎన్‌టిఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అధ్యక్షురాలు డా. ఎన్.లక్ష్మీపార్వతి అన్నారు. ‘శ్రీకృష్ణ పాండవీయము’ యాభై వసంతాల వైభవ కార్యక్రమం యువకళావాహిని ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ పౌరాణిక చిత్రాలలో ఎలాంటి పాత్రనైనా అవలీలాగా నటించిన వ్యక్తి ఎన్‌టిఆర్ అని కొనియాడారు. నటనలో జీవించేవాడని తెలిపారు. వివిధ రంగాల ప్రముఖులు సారిపల్లి కొండలరావు, డా. ఓలేటి పార్వతీశం, గార్లపాటి జితేంద్ర కుమార్, సాయి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వై.కె.నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, ఉమారాణి పాల్గొన్నారు.