హైదరాబాద్

స్వచ్ఛ్భారత్‌లో బల్దియాదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ వెయ్యి కోట్ల పై చిలుకు ఆస్తిపన్ను వసూలు చేసి ప్రధాని నరేంద్రమోదీతో భేష్ అనిపించుకున్న జిహెచ్‌ఎంసి ఇపుడు మరో సరికొత్త రికార్డును సృష్టించింది. రెండేళ్ల క్రితం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రధాని ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ మిషన్ కార్యకలాపాల కింద పారిశుద్ద్య కార్యక్రమాల అమలుపై దేశంలోని అన్ని మున్సిపాల్టీల్లో అమలవుతున్న ఈ-లర్నింగ్ పోర్టల్‌పై జిహెచ్‌ఎంసికి చెందిన 4323 మంది అధికారులు, సిబ్బంది అధ్యయనం చేయగా, వీరిలో 2889 మంది అధికారులు, సిబ్బంది కోర్సును విజయవంతం చేసుకుని సర్ట్ఫికెట్లు స్వీకరించారు. దీంతో స్వచ్ఛ భారత్ ఈ-లర్నింగ్ పోర్టల్ అధ్యయనంలో జిహెచ్‌ఎంసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అధికారులు తెలిపారు. ఈ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దేశంలోని అత్యధిక సంఖ్యలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అధికారులు దీన్ని వినియోగించటం విశేషం. జిహెచ్‌ఎంసిలో ఈ-లర్నింగ్ కోర్సును పూర్తి చేయించిన వారిలో మెడికల్ ఆఫీసర్ డా.మైత్రేయి, వర్క్ ఇన్‌స్పెక్టర్ టి. గజేందర్ బాబు అనే ఇద్దరు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచారు. వీరు 20 మందిచే కోర్సును పూర్తి చేయించి సర్ట్ఫికెట్లు పొందేలా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ విజయ్‌కృష్ణ, సీనియర్ అసిస్టెంటు డి. నర్సింగ్‌రావు, కంప్యూటర్ ఆపరేటర్ సి.వి రాజేందర్‌కుమార్‌లు కలిసి 19 మందికి ఈ-లర్నింగ్‌ను పూర్తి చేయించడంలో విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. కాగా హైదరాబాద్ తర్వాత ఈ పోర్టల్‌పై ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగర మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 3వేల 55 మంది రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా ఆ నగరం దేశంలోనే రెండో స్థానంలో నిలిచినట్లు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది. స్వచ్ఛ భారత్ లక్ష్యాల అవగాహనలో హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే ముందంజలో నిలిపడానికి హైదరాబాద్ సిటీ సపోర్టింగ్ యూనిట్ విశేషంగా కృషి చేయడం పట్ల జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి అభినందించారు.