హైదరాబాద్

నగరానికి సంక్రాంతి శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: మహానగరం సంక్రాంతి శోభను సంతరించుకుంది. గురువారం బోగీ అయినా నగరంలోని చాలా ప్రాంతాల్లో కులమతాలకతీతంగా ప్రజలు గాలిపటాలను ఎగురవేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్రాంతి సంబరాలను శిల్పారామంలో అధికారికంగా నిర్వహించటంతో అక్కడ పల్లె వాతావరణం నెలకొంది. గురువారం శిల్పారామం సందర్శకులతో కిటకిటలాడింది. ఈసారి సంక్రాంతి పండుగ జిహెచ్‌ఎంసి ఎన్నికల సందడి రోజుల్లో రావటంతో పండుగ శుభాకాంక్షల పేరిట ఆశావాహులు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలు చోట్ల యువకులను ఆకట్టుకునేందుకు గాలిపటాలు, చర్కాలు, మాంజాలు పంపిణీ చేశారు. పాతబస్తీలో సంక్రాంతి సందడి ఇక వేరుగా చెప్పనక్కర్లేదు. పోటీ పడి మరీ గాలిపటాలను ఎగురవేశారు. ఇక పీపుల్స్‌ప్లాజాలోనూ కైట్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. చిన్న పిల్లలు, మహిళలు, యువతీయువకులు సైతం ఎంతో ఉత్సాహాంగా గాలిపటాలను ఎగురవేశారు. పలు పార్కులు, ఖాళీ స్థలాల్లో కూడా యువకులు పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగురవేశారు. శుక్రవారం మరింత జోరుగా కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ఏర్పాట్లు చేశాయి.

అభ్యర్థుల వేట!

కాంగ్రెస్‌కు అభ్యర్థుల కరవు
డివిజన్ స్థాయి నేతలకు బుజ్జగింపు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 14: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా నగరంలోని పలు డివిజన్ల నుంచి పోటీ చేసేందుకు ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరవయ్యారు. మరోవైపు తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేడో, రేపో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని చెప్పటం గమనార్హం. పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన నగర నేతలు సిటీలో పార్టీ పటిష్టత కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదనేందుకు ఇదో నిదర్శనం. గతంలో పలు ఎన్నికల్లో మజ్లిస్‌తో అవగాహన పొత్తు పెట్టుకుని బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో కనీసం ఎన్నికల బరిలో నిలిచే నేతలు కూడా కరవయ్యారు. నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందిన నాటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంతకు ముందు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి ఆసిఫ్‌నగర్ నేటి నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు కరవయ్యారు. దీంతో పాటు పాతబస్తీలోని చార్మినార్, బహద్దూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట అసెంబ్లీల్లోని పలు డివిజన్లలో కనీసం డివిజన్ స్థాయి పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే క్యాడర్ లేదు. పార్టీ అధికారంలో ఉన్నపుడు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదిక్షణలు చేసిన పలువురు డివిజన్ స్థాయి నేతలు పోటీ చేయాలని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి నేతలు బుజ్జగిస్తున్నారు. ఆయా డివిజన్లలో ఒకవైపు మజ్లిస్ పటిష్టంగా ఉండటం, మరో వైపు టిఆర్‌ఎస్ అనుకూల పవనాలు వీస్తుండటంతో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో చోటుచేసుకున్న ఆసక్తికరమైన పరిణామాలు కాంగ్రెస్‌లో మళ్లీ చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అప్పట్లో ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యే టికెట్‌ను దానం నాగేందర్‌కు కేటాయించేందుకు అధిష్టానం అభ్యంతరాలు తెలపటం, సికిందరాబాద్ ఎంపి అభ్యర్థి ఎవరూ లేకపోవటం వంటి పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో దానం నాగేందర్‌ను పార్టీ అధిష్టానం సికిందరాబాద్ ఎంపి అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఆదేశించగా, ఆయన దాన్ని తిరస్కరించి రాత్రికి రాత్రే తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. అప్పటికే మహారాజ్‌గంజ్ ఎమ్మెల్యే టికెట్ కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న అంజన్‌కుమార్‌యాదవ్‌ను నామినేషన్ల స్వీకరణ చివరి రోజు, చివరి క్షణంలో ఎంపి అభ్యర్థిగా బరిలో దింపిన విధంగానే గ్రేటర్ ఎన్నికల్లోనూ 150 డివిజన్లలో మూడో వంతు డివిజన్లకు అభ్యర్థులు కరవయ్యారు. ఈ క్రమంలో పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు చివరి నిమిషంలో ఎవరినో ఒకర్ని బరిలో దింపాలన్న ఆలోచనతో అసెంబ్లీ కన్వీనర్లు డివిజన్ స్థాయి నేతలను పోటీ చేయాలంటూ బుజ్జగించే పనిలో ఉన్నారు.

అవినీతి హబ్‌గా బల్దియా
అజీజ్ పాషా ఆరోపణ
గ్రేటర్ ఎన్నికల్లో వన్
హైదరాబాద్ కూటమి
సీట్ల పంపకం ఖరారు
లోక్‌సత్తా 35, సిపిఐ (ఎం) 33, సిపిఐ 22, ఎంసిపిఐ 2

కాచిగూడ, జనవరి 14: బల్దియా అవినీతి హబ్‌గా మారిందని గ్రేటర్ వన్ హైదరాబాద్ కూటమి ఎద్దేవా చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో లోక్‌సత్తా, సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. వన్ హైదరాబాద్ పేరిట ఉమ్మడి ఎజెండాలో పేర్కొన్న వార్డుస్థాయిలో స్థానిక ప్రజలకే ఆధికారం తదితర అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించింది. ఈమేరకు గురువారం ఎంబి భవన్‌లో సీట్ల పంపకం ఖరారు చేసింది. లోక్‌సత్తా 35, సిపిఎం 33, సిపిఐ 22, ఎంసిపిఐ 2 స్థానాలలో పోటీ చేసేందుకు నిర్ణయించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి, పార్లమెంటు మాజీ సభ్యుడు అజీజ్‌పాషా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా హైదరాబాద్‌లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. హైదరాబాద్‌ను నెంబర్ వన్‌గా చేయడానికి వన్ హైదరాబాద్ కూటమి ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రజలల్లో నాయకులపై విశ్వసం పోతోందని తెలిపారు. ప్రజలతో సంబంధం లేనివారు రాజకీయాల్లో పోటీలకు దిగుతున్నారని ఆరోపించారు. వేలం పాటలో కార్పొరేటర్ టికెట్లు అమ్మకం, గెలుపుగుర్రాల పేరుతో అవినీతి పరులకు టికెట్లు కేటాయించడం వంటి వ్యాపార రాజకీయాలను కొన్నిపార్టీలు యధేచ్ఛగా చేస్తున్నాయని విమర్శించారు. టిఆర్‌ఎస్- ఎంఐఎం, టిడిపి-బిజెపి, కాంగ్రెస్ తదితర పార్టీల కుళ్ళు రాజకీయాల నుంచి ప్రజలు బయటపడడానికి ప్రత్యామ్నాయం వన్ హైదరాబాద్ మాత్రమేనని తెలిపారు. ప్రజలు తమ కూటమిని ఆదరించి ప్రతి ఒక్కరూ తమ కూటమి అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు డిజి.నర్సింహ్మారావు మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు నాలుగుకలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. నగర సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. అవినీతి రాజకీయాలను పక్షాళన చేయడానికి వన్ హైదరాబాద్ కూటమి ఏర్పడిందని తెలిపారు.
లోక్‌సత్తా గ్రేటర్ అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడుతూ కొత్త పార్టీలను ప్రజలు ఆదరించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కేసిఆర్ కేవలం నాలుగు ఉద్యోగాలు మాత్రమే తమ కుటుబ సభ్యులకు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నా పట్టించుకోకుండా అయుత చండియాగానికి కోట్లు రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కూటమి అభ్యర్థులు కృషి చేయాలని సూచించారు. వన్ హైదరాబాద్ కూటమి గ్రేటర్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. జనవరి 20న ఇందిరాపార్క్ వద్ద కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగసభలో కూటమి అభ్యర్థుల పరిచయం ఉంటుందని స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో ఎంసిపిఐ గ్రేటర్ అధ్యక్షుడు తాండ్ర కుమార్, సెంట్రల్‌సిటీ కార్యవర్గ సభ్యుడు ఎం.శ్రీనివాస్, లోక్‌సత్తా నాయకులు పాల్గొన్నారు.

ఆకాశాన్ని అంటిన
అంతర్జాతీయ పతంగుల పండుగ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతర్జాతీయ పతంగుల పండుగ ఇక్కడ ఏర్పాటుచేయటం ఎంతో ఆనందంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి ఏ.చందూలాల్ అన్నారు. గురువారం మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలోని ఆగాఖాన్ అకాడమీలో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ పతంగుల ఉత్సవాలను మంత్రి లాంచనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సమయంలో సంప్రదాయంగా అనేక సంవత్సరాలుగా హైదరాబాదీలు ఉత్సాహంగా ఎగుర వేసుకునే పతంగులకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, దాదాపు అంతర్జాతీయ గుర్తింపు పొందిన 30 మంది పతంగుల క్రీడాకారులు (ఇండోనేషియా, వియత్నాం, థాయ్‌లాండ్, యుఎస్, యుక్రైన్‌కు చెందిన) పాల్గొంటున్నారని మంత్రి ఉత్సాహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఉత్సవాలు పర్యాటక రంగానికి ఊతమిస్తాయని, వీటిని నిర్వహిస్తున్న ఆగాఖాన్ అకాడిమీని ఆయన కొనియాడారు. బాలలకు స్ఫూర్తి, ఉత్సాహం కలిగించే ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించుకోవాలని ఆయన అన్నారు. వివిధ పాఠశాలల నుండి వచ్చిన బాలబాలికలు ఈ పతంగుల ఉత్సవంలో పాల్గొనడంతోపాటు పతంగుల తయారీ, వాటిపై అందమైన డిజైన్లు రూపొందించడంలో శిక్షణ పొందారు. ఆదిలాబాద్‌కు చెందిన కళాకారులు చేసిన జానపద నృత్యం, కోలాటం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టూరిజం శాఖ కార్యదర్శి వి.వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాల మేధావి నైనా జైస్వాల్ పాల్గొన్నారు.

ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసి వెళ్లిన రైళ్లు
సికింద్రాబాద్, జనవరి 14: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలో నుంచి ఏపికి వెళ్లే అన్ని రైళ్లు కిక్కిరిసిన ప్రయాణీకులతో వెళుతున్నాయి. నగరానికి వచ్చేవారు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో స్టేషన్‌లు సందడిగా మారిపోయాయి. రెగ్యులర్‌గా ప్రయాణించే రైళ్లకు అదనంగా బోగీలను ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికుల అవసరాలను ఎంతమాత్రం తీర్చలేకపోతున్నాయి. ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి వందలాది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన అవి వారి అవసరాలను ఎంతమాత్రం తీర్చలేకపోతున్నాయి. పొగమంచు కారణంగా రద్దు చేసిన రైళ్లను సైతం అధికారులు పునరుద్ధరించారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతరం రిజర్వేషన్‌లను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రైల్వే స్టేషన్‌లో బారెడు లైన్లు తప్పడం లేదు. రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ వెయిటింగ్ టికెట్ ఉన్నప్పటికి కూడా అది తప్పని తెలిసినా తప్పని సరి పరిస్థితుల్లో రిజర్వేషన్ బోగీల్లోనే ఎక్కి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని చూస్తున్నారు. దీంతో రిజర్వేషన్ బోగీలు సైతం జనరల్ బోగీలను తలపిస్తున్నాయి. ఇక జనరల్ బోగీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేకుండా ఉంది. కనీసం కాలుమోపడానికి వీలులేని పరిస్థితుల్లో ప్రయాణికులు తరలివెళుతున్నారంటే డిమాండ్ ఎంతమేరకు ఉందో తెలుసుకోవచ్చు. ఇది కొత్తేమీ కాదు ప్రతిసారి పండుగల సమయంలో కనిపించే రద్దే, మరీ ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో ఈ రద్దీ మరీ దారుణంగా ఉంటుందన్న విషయం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు తెలియందేమీ కాదు. అయినప్పటికీ అరకొరగా రైళ్లను ఏర్పాటు చేసి చేతులుదులుపుకుంటున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఉన్న లైన్లపై ట్రాఫిక్ రద్దీ పెరిగినప్పటికి వాటిపైనే కాలం వెళ్లదీస్తూ అవసరాలను తీరుస్తూ రైల్వే అధికారులు నెట్టుకొస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణికులు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా రైల్వేలైన్లను కొత్త రైళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ రైల్వేశాఖ ఆ దిశగా వేసే అడుగులు నత్తనలను మరిపిస్తున్నాయి. యేళ్లతరబడి సాగుతున్న రైల్వే ప్రాజెక్టులు వాటికి విదులుస్తున్న అరకొర నిధులతో ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేది ఎప్పుడు, పెరుగుతున్న ప్రయాణికుల డమాండ్‌లను చేరుకునేది ఎప్పుడో ఘనత వహించిన ఈ పాలకులే సెలవియ్యాల్సిన అవసరం ఉంది.

పౌరసేవలు మధ్యాహ్నం 3గంటల తరువాతే
ఖైరతాబాద్, జనవరి 14: గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతుండటంతో ఖైరతాబాద్ జిహెచ్‌ఎంసి కార్యాలయంలో పౌరసేవలను 3గంటల తరువాతే అందుతాయని జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
గురువారం లాఅండ్‌ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జోనల్ కార్యాలయం ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై ఉండటం, మరో వైపు ఈ రోడ్డుపై మెట్రోరైల్ పనులు కొనసాగుతుండటంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నామినేషన్లు దాఖలుకు వచ్చే అభ్యర్థులు వాహనాలను లక్డీకపూల్ రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని గౌరవ్ తెలిపారు. ప్రధాన గేటులో నుంచి కాకుండా చిన్న గేట్ నుంచి ప్రవేశం ఉంటుందని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సిబ్బందికి అభ్యర్థులు సహకరించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
సర్కిల్‌లో పెరిగిన ఓటర్లు
సెంట్రల్ జోన్ పరిధిలో విడుదల చేసిన తుది జాబితాలో డివిజన్ల వారీగా ఓటర్లు పెరిగారు. గతంలో, ఇప్పటి ఓటర్ల వివరాలను బ్రాకెట్లలో ఇచ్చాము. ఖైరతాబాద్ (55221- 59630), వెంకటేశ్వరకాలనీ (40263- 42701), బంజారాహిల్స్ (43460- 48532), జూబ్లీహిల్స్ (43709- 47043), సోమాజిగూడ (46084- 49483), షేక్‌పేట (46997- 49814), యూసఫ్‌గూడ (53449- 59,919), వెంగళ్‌రావునగర్ (40998- 47274), ఎర్రగడ్డ (46457- 49223), రహమత్‌నగర్ (54909- 58098), బోరబండ (40794- 42048), అమీర్‌పేట్ (46170- 47892), సనత్‌నగర్ (58063- 49892).

వ్యాపార వృద్ధికి ప్రణాళికలు
నార్సింగి, జనవరి 14: ఈ ఆర్ధిక సంవత్సరంలో అదనంగా మరో 200కోట్ల రూపాయాల వ్యాపారం నిర్వహిస్తుందని ఆగ్రసేన బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ కేడియా అన్నారు. గురువారం మాసబ్‌ట్యాంక్ గోల్కొండ హోటల్‌లో అగ్రసేన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఇంటెన్సివ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. అగ్రసేన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అత్యున్నత లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నాలు ప్రారుంభించిందని పేర్కొన్నారు. సృజనాత్మక వ్యాపార మొబిలైజేషన్ క్యాంపెయిన్‌ని జనవరి 18 నుంచి ఫిబ్రవరి 4 వరకు నిర్వహిస్తామని తెలిపారు. క్యాంపెయిన్‌లో ఖాతాదారుల్లో స్ఫూర్తి కలిగించటంతో పాటుగా, వారితో మరింత అనుబంధాన్ని పెంచుకుంటామని పేర్కొన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఖాతా తెరువటం, తక్షణమే రుణాలను మంజూరు చేయటం, వాహన రుణాలు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో స్టార్టప్స్‌కి రుణాలు అందిస్తారని తెలిపారు. నగరంలోని త్వరలో మరో పది శాఖలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఏకె గోయల్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకి అనుగుణంగా క్యాంపెయిన్‌ను ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. అగ్రసేన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ పివి శర్మ మాట్లాడుతూ బ్యాంక్ వృద్ధిని గురించి తెలుపటంతో పాటుగా సుప్రసిద్ధ వాటాదారులని పరిచయం చేశారని అన్నారు. బ్యాంక్ మొబిలైజేషన్ క్యాంపెయిన్‌ను సీని నటి అక్షిత చేతుల మీదుగా ప్రారంభించారు.

యువత సామాజిక స్పృహతో మెలగాలి
ఇబ్రహీంపట్నం, జనవరి 14: యువత సామాజిక స్పృహతో మెగిలి ప్రజలకోసం పనిచేయాలని ఎసిపి నారాయణగౌడ్ పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండల పరిధిలోని తులేకలాన్‌లో గుజ్జ జంగయ్య స్మారక క్రీడోత్సవాలను ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి, సిఐ పి.జగదీశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. చాటింగులతో చీటింగ్ చేసే సంస్కృతికి చరమగీతం పాడాలని సూచించారు. అకస్మికంగా మరణించిన స్నేహితుడి స్మారకార్థం ఏటేటా అతని మిత్రులు క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో తెరాస జిల్లా నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపిటిసి బాసాని కళావతి రాజిరెడ్డి, సర్పంచ్ ఎర్నాగి జయమ్మ రవీందర్, మాజీ సర్పంచ్‌లు చిలుక బుగ్గరాములు, కొంగర బీరప్ప, సింగిల్ విండో డైరెక్టర్ కలకొండ వీరయ్య, యూత్ సభ్యులు కలకొండ బాష, గుజ్జ యాదగిరి, అచ్చన శ్రీను, ప్రభాకర్, గిరి, నాయకులు డి.కిషన్, జగన్, పాండు పాల్గొన్నారు.
పొల్కంపల్లిలో..
సంక్రాంతిని పురస్కరించుకొని మండల పరిధిలోని పొల్కంపల్లిలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలను సిఐ జగదీశ్వర్, ఎస్‌ఐ ఇఫ్తేకార్ అహ్మద్ ప్రారంభించారు. క్రీడలతో యువత మద్య స్నేహభావం పెంపొందుతుందని, క్రీడోత్సవాల నిర్వాహణలో యువత ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ లక్ష్మణరావు, మాజీ వైస్ ఎంపిపి శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రజలను దోచుకుంటున్న
ప్రైవేట్ ఆపరేటర్లు
- తెలంగాణ ఉద్యమ వేదిక -
ఖైరతాబాద్, జనవరి 14: ప్రజలను నిలువునా దోచుకుంటున్న ప్రైవేట్ ఆపరేటర్లపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమ వేదిక నాయకుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బచావో తెలంగాణ నాయకులు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ బస్సుల వల్ల ఆర్టీసికి ఏటా వందలకోట్లు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆపరేటర్లు మాఫియాగా ఏర్పడి ప్రజలవద్ద నుంచి ఇష్టానుసారంగా వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. లాభాలబాటలో ఉన్న రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు కేటాయిస్తూ ఆర్టీసి నష్టాలకు ప్రభుత్వమే కారణవౌతుం