హైదరాబాద్

నీట మునిగిన దేవనార్ అంథుల పాఠశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట, సెప్టెంబర్ 21: మహానగరంలో కురిసిన భారీ వర్షానికి బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాల నీట మునిగింది. రాత్రి ఒకటిన్నర గంటల నుంచే పాఠశాలలోకి నీరు రావటాన్ని గమనించిన సిబ్బంది ఈ స్కూల్‌లోని అంధులను తెల్లవారుఝము 3 గంటల వరకు పై అంతస్తులకు తరలించారు. ఈ పాఠశాలకు ఎగువన ఉన్న దాదాపు 25 అపార్ట్‌మెంట్ల డ్రైనేజీ కనెక్షన్లు ఈ ప్రాంతం మీదుగా ప్రవహించే ధుర్గం చెరువు నాలాలోకి ఉండటం, ఎక్కువ మొత్తంలో నీరు ఉద్దృతంగా ప్రవహించటం వల్లే ఈ పాఠశాలలోకి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ పాఠశాలోని చిన్నారులకు టిఫన్, భోజనం తయారు చేసే వంట శాల, వారి బట్టలను దాచుకునే డారిమేటరీ పూర్తిగా నీట మునిగాయి. విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందక అనేక ఇబ్బందుల పాలయ్యారు. మధ్యాహ్నం కూడా కొందరు దాతల ద్వారా భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పాఠశాలలో చేరిన నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవటంతో, చిన్నారులకు బుధవారం సాయంత్రం జ్వరం వంటి అనారోగ్య లక్షణాలు కూడా కన్పించాయి.
అయిదేళ్లలో ఇదే మొదటి సారి
ఈ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్న తాము అయిదేళ్లలో పాఠశాల నీటిలో మునిగిపోవటం ఇపుడే చూస్తున్నామని అంధ విద్యార్థులు ప్రభాకర్, నవీన్, గణేష్, పాండు, ప్రభాకర్ అనే కరీంనగర్‌కు చెందిన చిన్నారులు వాపోయారు. రాత్రి నుంచి క్రమంగా స్కూల్‌లోకి నీరు రావటంతో తామెంతో భయపడిపోయి, ఓ గదిలో బిక్కుబిక్కుమంటూ తెల్లవారుఝము వరకు గడిపామని తెలిపారు. తరగతి గదిలో పెట్టుకున్న కంప్యూటర్లు, పుస్తకాలు మొత్తం నీట మునిగిపోయామని చిన్నారులు వాపోయారు.