హైదరాబాద్

విశ్వనగరమన్నారు.. మురికివాడ చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: స్వరాష్ట్ర సిద్ధించి, స్వపరిపాలన ప్రారంభం కాగానే మహానగరాన్ని విశ్వనగరం చేస్తామని ప్రకటించిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోందని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనీల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. తరుచూ కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొవటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ గురువారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అనీల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రి కెటిఆర్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనీల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ తరుచూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్డు కుంగిపోయిన సంఘటన ప్రంపచ స్థాయిలో ప్రచారం జరుగుతుందని, ఇది హైదరాబాద్ బ్రాండి ఇమేజీని దెబ్బతిసేలా సర్కారు వహించిన నిర్లక్ష్యానికి పర్యవసానమేనంటూ వ్యాఖ్యానించారు. సర్కారు, జిహెచ్‌ఎంసి నిర్లక్ష్యం కారణంగానే నగరంలో రోడ్లు వాహనదారులకు నరకాన్ని చూపుతున్నాయని, భారీ వర్షాలున్నాయంటూ వాతావరణ శాఖ పదే పదే హెచ్చరికలు చేస్తున్నా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం, జిహెచ్‌ఎంసి ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల ముందు నగరాభివృద్ధికి సంబంధించి కెసిఆర్, కెటిఆర్ ఎన్నో వ్యాఖ్యలు చేశారని, నేడు అవన్నీ విస్మరించి వ్యవహారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియాలో టిఆర్‌ఎస్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లున్నా, వారం రోజులుగా వర్షాలు కురిసి నగరం మొత్తం అతలాకుతలమైతుంటే ఎక్కడ ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ప్రజల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన వాపోయారు. కాంగ్రెస్ హయంలో నగరంలో ఏ చిన్న ఘటన జరిగినా, నేరుగా మంత్రులు సందర్శించి, సహాయక చర్యలను దగ్గరుండి మరీ పర్యవేక్షించేవారని అనీల్ వివరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, వివిధ నియోజకవర్గాల నేతలు అనిల్, సాయి, సాబేర్, మనోజ్‌యాదవ్, అభిషేక్ తదితరులు అరెస్టుయిన వారిలో ఉన్నారు.