హైదరాబాద్

‘గాంధీ’ ఆసుపత్రికి తలవంపులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, సెప్టెంబర్ 22: ప్రాణాపాయస్థితిలో ఉన్నవారు చికిత్స కోసం వస్తే ఆపన్నహస్తం అందించి అక్కున చేర్చుకోవాల్సిన వైద్యసిబ్బంది దానిని మరచి చీదరింపులు, నిర్లక్ష్యపుపనితీరుతో వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు. ఈ ప్రపంచంలో ఒక్కసారి పోతే దాని తిరిగి తీసుకురాలేనిది ప్రాణం మాత్రమే. అలాంటి ప్రాణాలను కాపాడాల్సిన పెద్దాసుపత్రిలో కొందరు సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతూ అమాయక ప్రజల ప్రాణాలకు విలువలేనట్టుగా వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వవైద్యాన్ని అభాసుపాలు చేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని మంత్రులు పోటీలు పడి ప్రకటనలు చేసినా, కోట్లాది రూపాయల నిధులతో కొత్తసంస్కరణలు తీసుకువస్తున్నామని చెబుతున్నా అవేమీ అక్కడ మచ్చుకైనా కనిపించవు. అతిపెద్ద ధర్మాసుపత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మక గాంధీ ఆసుపత్రికి వస్తుంటారు. ఇక్కడ మెరుగైన వైద్యం అందుతున్న ఆశతో వస్తున్న రోగులకు ఆదరించి హక్కున చేర్చుకుని సాంత్వన చేకూర్చాల్సిన కొంత మంది వైద్య సిబ్బంది తీరు ప్రభుత్వానికి ప్రభుత్వ వైద్యానికి తీవ్ర తలవంపులు తీసుకువచ్చేదిగా ఉంటుంది. మొన్నటి మొన్న రోడ్డుప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వచ్చిన వ్యక్తిని స్కానింగ్ సదుపాయం లేదని ఉస్మానియాకు గాంధీకీ రెండు సార్లు తిప్పేలోపలే అతని ప్రాణాలు అనంతవాయవుల్లో కలిసిపోయాయి. సకాలంలో వైద్యం అంది ఉంటే సదరు యువకుడు ప్రాణాలతో బయటపడేవాడేమో. అలాకాకుండా ప్రాణాలను కాపాడే స్థానంలో ఉన్న వైద్యులు సైతం కరుకుగా వ్యవహరిస్తుండటంతో సర్కార్ వైద్యం పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. తాజాగా గురువారం అంబులెన్స్‌లో తీసుకువచ్చిన రోగిని వర్షంలో స్ట్రెచ్చర్‌పై వదిలివేయడాన్ని చూస్తుంటే గాంధీ ఆసుపత్రి సిబ్బంది ఎంత నిర్లక్ష్యపు నీడలో మానవత్వాన్ని మర్చి ప్రవరిస్తున్నారో అవగతమవుతుంది. వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్.లక్ష్మారెడ్డి గాంధీలో చోటు చేసుకుంటున్న ఇలాంటి సంఘటనల పట్ల ఎందుకు స్పందించడం లేదని రోగులు ప్రశ్నిస్తున్నారు. మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న సిబ్బందిపట్ల చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి నిర్లక్ష్యపు నీడలో మగ్గుతున్న గాంధీ ఆసుపత్రి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని రోగులు వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
వీర జవాన్లకు నివాళులు
వనస్థలిపురం, సెప్టెంబర్ 22: పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన భారత్ జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ గురువారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏసిపి బి.్భస్కర్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.

హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షుడిగా నూతి శ్రీకాంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 22: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలోని బిసి సెల్‌కు అధ్యక్షుడిగా నూతి శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ బిసి సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి చిత్తరంజన్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని స్వీకరించారు. గతంలో శ్రీకాంత్ గ్రేటర్ హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహారించారు. తాజాగా బిసి సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ బిసి సెల్ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిత్తరంజన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రభూమి బ్యూరో