హైదరాబాద్

ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: నగరానికి మరో రెండురోజుల పాటు భారీ వర్ష సూచనలుండటంతో ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రెస్క్యు బృందాలు, పోలీసు, అగ్నిమాపక బృందాలు క్షేత్ర స్థాయిలో సిద్దంగా ఉన్నాయని, అవసరమైతే సైన్యాన్ని దింపేందుకు కూడా కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
జిహెచ్‌ఎంసిలోని కంట్రోల్ రూం ద్వారా వర్షాల పరిస్థితులను పర్యవేక్షించిన మంత్రి కెటిఆర్ విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పటికే నగరంలో నీట మునిగిన ప్రాంతాల్లో మోటార్ల నీటిని తోడేసేందుకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది క్షేత్ర స్థాయి విధుల్లో నిమగ్నమైందని వివరించారు. ప్రస్తుత వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారాయని, వీటన్నింటిని 2 నెలల్లో మళ్లీ నిర్మిస్తామన్నారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణే గాక, వరద సహాయక చర్యల్లో చరుకుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల నుంచి నీటిలోనే ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాతావరణ శాఖ అందిస్తున్న వర్షసూచనలు, హెచ్చరికల ద్వారా ఎప్పటికపుడు ప్రజలను, అత్యవసర బృందాలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో నగరంలోని చెరువులు, కుంటలు 80 శాతం వరకు నిండిపోయాయని మంత్రి వెల్లడించారు.
ప్రతి చెరువు, కుంటల వద్ధ ముందుజాగ్రత్త చర్యగా ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచటంతో ఇతర వరద నివారణ చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, అంబర్‌పేట నాలాలో పోలియో వ్యాధి వైరస్‌ను నిర్థారించిన విషయాన్ని ప్రస్తావించగా, పోలీయో వైరస్ లేదని, ఇది కేవలం పుకారేనని మంత్రి వ్యాఖ్యానించారు.
ఆక్రమణలపై ఉక్కుపాదం
భారీ వర్షాలు కురిసినపుడు ఎక్కువ మొత్తం నీటిని నగరం నుంచి బయటకు ప్రవహింపజేసే నాలాలపై వెలసిన ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ ఆక్రమణల తొలగింపుకు చేపట్టాల్సిన చర్యల విషయమై మంత్రి కెటిఆర్ శుక్రవారం టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలోని మొత్తం సీవరేజీ సిస్టమ్‌ను ఆధునీకరించనున్నట్లు తెలిపారు.
మొత్తం నగరానికే ముప్పు వాటిల్లేలా వెలసిన ఈ ఆక్రమణలను తొలగించేందుకు బెంగుళూరు తరహా టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ అమలు విషయంపై చర్చించారు. నాలాల ఆక్రమణలను గుర్తించి, అందులో తొలుత బడాబాబుల ఆక్రమణలను గుర్తించి తొలగించాలని నిర్ణయించిన మంత్రి జిహెచ్‌ఎంసి కార్యాలయం నుంచి నేరుగా హోటల్ వైస్రాయ్ వద్ధ సాగర్ ఔట్‌ఫ్లో అలుగులను పరిశీలించారు.
కేవలం వరద ముప్పు పొంచి ఉన్నపుడే నాలాలు గుర్తుకొచ్చే పాలకులు గతంలో కూడా వీటిని తొలగించాలని జారీ చేసిన ఆదేశాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇపుడు తాజాగా యువ మున్సిపల్ మంత్రి వీటి తొలగింపుకు ఎలా ముందుకెళ్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.