హైదరాబాద్

జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూంకు ఫిర్యాదుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యల పర్యవేక్షణ నిమిత్తం జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూంకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు జిహెచ్‌ఎంసికి సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు 21111111 నెంబర్ మాత్రమే ఉండేది. వర్షాలు భారీగా కురిసే అవకాశాలున్నాయంటూ కొద్ది రోజుల క్రితం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో జిహెచ్‌ఎంసి అదనంగా మై జిహెచ్‌ఎంసి యాప్‌ను అందుబాటులోకి తేవటంతో పాటు అదనంగా డయల్ 100ను కూడా అనుసంధానం చేసుకోంది. అయినా టోల్ ఫ్రీ నెంబర్ 21111111కు ఫిర్యాదులు పెరిగాయి. మామూలు రోజుల్లో కేవలం పగటిపూట పదుల సంఖ్యలో ఫిర్యాదులొచ్చేవని, కానీ నాలుగు రోజులుగా రాత్రి పూట కూడా వందల సంఖ్యలో ప్రజల నుంచి కాల్స్ వస్తున్నట్లు కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది పేర్కొంది. కానీ భారీ వర్షాలు ప్రారంభమైన నాటి నుంచి శనివారం సాయంత్రం అయిదు గంటల వరకు మొత్తం 2వేల 86 వర్షాలకు సంబంధించిన ఫిర్యాదులొచ్చినట్లు వారు వెల్లడించారు. వీటిలో చెట్లు విరిగిపడినట్లు 62, ప్రహరీగోడలు కూలినట్లు 10, భవనాలు కూలినట్లు 3, రోడ్లపై వాటర్ నిలిచిపోయిందంటూ 636, మ్యాన్‌హోల్స్, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నట్లు 197, కరెంటు సరఫరాకు సంబంధించి 114 ఫిర్యాదులు రాగా, ఇతరాత్ర సమస్యలైన గ్యార్బెజీ, వీది దీపాలు, జంతు సంబంధిత, ఫాగింగ్, రోడ్లపై గుంతలకు సంబంధించి వర్షం కురిసిన నాలుగు రోజుల్లో వెయ్యి వరకు వచిచనట్లు అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే నగరవాసులు వర్షానికి సంబంధించి 221 ఫిర్యాదులు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో కరెంటు సరఫరాకు సంబంధించి 23, చెట్లు విరిగిపడినట్లు 17, రోడ్లపై నీరు నిల్చిపోయిందంటూ 86 ఫిర్యాదులున్నాయని, వీటిలో 73 పరిష్కరించాలని, మరో 72 పురోగతిలో ఉన్నాయని, 76 ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మై జిహెచ్‌ఎంసి యాప్, 21111111, డయల్ 100కు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, ఆ తర్వాత వాటి పరిష్కార పురోగతిని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు.