హైదరాబాద్

జిల్లాలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: హైదరాబాద్ జిల్లాలో కూరుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖల అధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రతి రోజు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో, 104 సంచారా వైద్య సేవల ద్వారా, అంబులెన్స్‌ల ద్వారా అత్యవసర వైద్య శిబిరాలను జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా అనేక సమస్యలకు లోనవుతున్న ప్రజలకు వారి ప్రాంతాల్లోనే సేవలిందించే విధంగా కాలనీలో, బస్తీల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నాంపల్లి హబీబ్‌నగర్ ఓవైసీ కమ్యూనిటీ హల్, ఆచార్య భవన్ తోఫ్ఖానా, లలితనగర్, శారదనగర్ కమ్యూనీటీ హల్, గంగానగర్, రాజ నర్సింహనగర్, శివాజీనగర్, అరుందతి నగర్ కాలనీ, రెయిన్‌బజార్, అజాద్‌నగర్‌లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్ పాల్గొంటున్నారు. శిబిరాల్లో పాల్గొన్న ప్రజలకు వైద్య పరీక్షల అనంతరం మందులు కూడా అందజేస్తామని తెలిపారు.
* అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు
అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్ జిల్లాలో కూరుస్తున్న భారీ వర్షాలతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కోనేందుకు వీలుగా జిల్లా రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా అదేశించారు. రెవెన్యూ అధికారులు భారీ వర్షాల కారణంగా ఆయా మండలాల పరిధిలోని ప్రాంతాల్లో సంభవించే పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ తగు చర్యలు తీసుకోవాలని, అన్ని వేళాల్లో జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉండాలని సూచించారు.