హైదరాబాద్

లష్కర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తాం: పజ్జన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, సెప్టెంబర్ 26: తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి తీరుతామని మంత్రి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని లాలాపేట్ ఇసుకబావి ప్రాంతంలోని రైల్వే స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించిన ఈ ప్రాంతంలోని రైల్వేస్థలాన్ని దాదాపు 25ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం రైల్వే మంత్రిని కోరారు. ఇందుకు సంబంధించిన సర్వేలు పూర్తిచేసి పంపించడానికి కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే మంత్రి సోమవారం మరోసారి లాలాపేట్ ప్రాంతంలో పర్యటించారు. మంత్రి పద్మారావుగౌడ్ మాట్లాడుతూ లష్కర్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మురికివాడల ప్రజలకు ప్రభుత్వం తరపున పక్కా ఇంటిని నిర్మించి ఇస్తామని ఇచ్చిన వాగ్థానాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలం కోసం అనే్వషిస్తామని, ప్రభుత్వ స్థలం ఉంటే ఇప్పటికే ఇళ్లను దాదాపు పూర్తి చేసేవారమని అన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా రైల్వే స్థలాలు విస్తరించి ఉన్నాయని, ప్రజల కోసం కేంద్ర రైల్వేశాఖతో సంప్రదింపులు జరిపి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోనున్నామని చెప్పారు.
దాదాపు పదివేల మంది కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా తాము ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని కేటాయించేంతవరకు విశ్రమించబోమని మంత్రి పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. వర్షాలకు గుంతలు పడిన రోడ్లను మరమ్మతులు చేపట్టనున్నామని తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా కురిసి ప్రాజెక్టులు జలకళతో నిండి ఉన్నాయని పేర్కొన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు నిండి సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ, కాకతీయ పథకాలతో రాష్ట్రంలో సాగునీరు తాగునీటికి ఇబ్బందులు తొలగిపోవడం ఖాయమని అన్నారు. లష్కర్ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు.
ఈ సమస్యను త్వరలోనే అధిగమించి అత్యధికంగా డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్లను నిర్మించి రికార్డు సృష్టిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ ఆలకుంట సరస్వతి పాల్గొన్నారు.