హైదరాబాద్

చలామణిలో లేని కరెన్సీతో మోసానికి యత్నించిన ఐదుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 26: చలామణిలో లేని విదేశీ కరెన్సీతో మోసం చేసేందుకు యత్నించిన ఐదుగురు నిందుతులను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా కాసిబుగ్గకు చెందిన రామసాగర్, హైదరాబాద్ సైదాబాద్‌కు చెందిన కొండేటి కరుణాకర్, సికింద్రాబాద్ పద్మారావునగర్‌కు చెందిన రంజిత్‌కుమార్, గుంటూరు జిల్లా పెద్దకాకానికి చెందిన మాతాంగి రవిచంద్, గుంటూరు జిల్లాకు చెందిన నాగమల్లేశ్వర్ రావు గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో 2007లో వెనిజులా దేశంలో బ్యాన్ చేసిన కరెన్సీని సేకరించి మోసానికి యత్నించారు. అమీర్‌పేట బిగ్‌బజార్ వద్ద మార్పిడికి యత్నిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న పంజాగుట్ట క్రైం పోలీసులు వారిని వలపన్ని పట్టుకున్నారు. మొదట తమేకేమి తెలియదని చెబుతూ తప్పించుకునేందుకు యత్నించగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి పూర్తిస్థాయిలో విచారించగా వారు చేయదలచుకున్న మోసాన్ని వెల్లడించారు. వెంటనే వారి వద్ద నుంచి వెనిజులా దేశంలో బ్యాన్ చేసిన 1700 నోట్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా ఇదే కేసుతో సంబంధం ఉన్న కేరళ రాష్ట్రానికి చెందిన జావెద్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే అతన్ని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ తరహా మోసాలు నగరవ్యాప్తంగా జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిసిపి సూచించారు. సమావేశంలో ఏసిపి వెంకటేశ్వర్లు, సి ఐ మోహన్ కుమార్, డిఐ లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు.