హైదరాబాద్

ఏమి తినాలే.. ఎట్ల బతకాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: కురిస్తే అతివృష్టి లేదంటే అనావృష్టే.. వరుణుడు కరుణించి మన అంచనాలకు ఎక్కువ వర్షాలను కురిపిస్తే కనీసం నీటిని పొదుపు చేసుకోలేని దుస్థితి. నీరు నిలిచే చెరువుల్లో ఇళ్లను, పరిశ్రమలను నిర్మిస్తున్నా, పాలకులు వహించిన నిర్లక్ష్యం నేడు నగరం నీట మునిగేందుకే కాదు పొద్దంతా రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికుల జీవనాధానికి కూడా గండి కొడుతోంది. పరిశ్రమల్లో రోజువారీ కూలీతో పొట్టనింపుకునే వారు కొందరు కాగా, రెగ్యులర్‌గా భవన నిర్మాణ రంగంలో పనిచేసుకుంటూ జీవించే వారు నగరంలో అనేక మంది ఉన్నారు. తరుచూ వర్షాలు కురవటం, మరో అయిదు రోజుల పాటు నగరానికి వర్షసూచన ఉన్నట్లు వచ్చిన ప్రకటనతో భవన నిర్మాణ కూలీలతో పాటు శివారుల్లోని చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసుకునే కార్మికుల జీవనాధారం అగమ్యగోచరంగా తయారైంది. అంతేగాక, వర్షాలు కురుస్తున్నపుడు భవన నిర్మాణ పనులు చేపట్టే అవకాశం లేకపోవటంతో నగరంలోని నింబోలీ అడ్డా, కోఠి, హబీబ్‌నగర్, నాంపల్లి, ఖైరతాబాద్, సిటీలైట్ ఇతరాత్ర ప్రాంతాల్లోని లేబర్ అడ్డాలు కూలీల్లేక నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, మెదక్‌తో పాటు ఇతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో మహబూబ్‌నగర్, ఆంధ్రాలోని ప్రకాశ్, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కార్మికులు పనిలో మంచి పేరు సంపాదించారు. ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల నుంచే పని కోసం అడ్డాపై నిలిచుండే వీరు ప్రస్తుతం వర్షాకారణంగా కన్పించటం లేదు. ఆదివారం సెలవు రోజు అయినా, పనిరోజైన సోమవారం కూడా వీరి సంఖ్య అంతంతమాత్రంగానే కన్పించింది. వర్షం కారణంగా బడా నిర్మాణాల పనులను నిలిపివేయటంతో వీరు పనుల్లేక అల్లాడిపోతున్నారు. ఇటీవలి వర్షాలతో విద్యుత్ బిల్బుల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తాము ఫ్యాక్టరీకి వెళ్లి చూస్తే ఇంకా వరద నీరు కన్పిస్తోందని, నీరు తగ్గే వరకు పనిచేయని పరిస్థితులు నెలకొన్నాయని కార్మికులు వాపోయారు.
శివారు పరిశ్రమల్లో మరో 40వేల మంది
నాలుగైదురోజులుగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిసి నగర శివార్లలోని కుత్బుల్లాపూర్, దులపల్లి, జీడిమెట్ల, చీర్లపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్ ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలు వరద ముప్పుకు గురయ్యాయి. కొన్ని పరిశ్రమలకు, ఫ్యాక్టరీలకు విద్యుత్ సరఫరా కూడా స్తంభించింది. పరిశ్రమల్లోని ముడిసరుకు, యంత్రాలు మరమ్మతుల పాలు కావటంతో యజమాన్యాలు పనిని, ఉత్పత్తిని ఆపివేశారు. వర్షం మొత్తం తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప, మళ్లీ పరిశ్రమలను పునరుద్ధరించేది లేదని యాజమాన్యలు తేల్చి చెప్పటంతో ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న దాదాపు 40వల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్, చత్తీస్‌ఘడ్, పశ్చిమబెంగాల్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ జిల్లాలకు చెందినవారు కూడా ఉన్న వీరంత కడుపులు మాడ్చుకోవల్సి వస్తోంది.